చిన్నపిల్లల దగ్గర తొందరపడి ఎలాంటి మాటలు మాట్లాడినా దాని ఫలితం దారుణంగా ఉంటుంది.  పిల్లలపై దాని ప్రభావం చూపుతుంది.  పెద్దయ్యాక పిల్లలు ఆ మాటల్ని పట్టుకొని మారేందుకుప్రయత్నం చేస్తుంటారు.  మంచిగా చెప్పేందుకు ప్రయత్నం చేస్తే.. మంచి గురించి చెప్తే.. పిల్లలు మంచి బాటలో పయనిస్తుంటారు.  చెడు మాటలను చెప్తే.. చెడుగా మారిపోతుంటారు.  


బాలల దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బైజ్ నాథ్ కుష్వాహో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  బాలల దినోత్సవం రోజున ఎమ్మెల్యే ఓ ప్రైవేట్ స్కూల్ కు వెళ్లి అక్కడ పిల్లలతో ముచ్చటించారు.   అదే సమయంలో పిల్లలను మద్యం జోలికి వెళ్ళకూడదు అని చెప్పాడు.   అలా చెప్పి ఊరుకుంటే సరిపోయేది.  చరిత్ర గురించి బాగా తెలిసిన వ్యక్తిగా తొందరపడి నోరుజారి కొన్ని వ్యాఖ్యలు చేశారు.  


గతంలో ఢిల్లీ, మహోబా, కన్నౌజ్ ప్రాంతాలను పృద్విరాజ్ చౌహన్, పరిమళ్, జైచాంద్ తదితరులు పాలించారని,  వారంతా మద్యం మద్యానికి బానిసలు కావడంతో వారి రాజ్యం అంతరించి పోయినట్టు తెలిపారు.  వారి రాజ్యం కోల్పోయిన తరువాత వారి కోటల్లో గబ్బిలాలు తిరుగుతున్నాయని అన్నారు.  మద్యానికి బానిసలు కావడం వలనే రాజ్యాలు కోల్పోయినట్టు అయన పిల్లలకు చెప్పారు.  


అయితే, దీనిపై ప్రతిపక్షం బీజేపీ మండిపడింది.  చరిత్ర గురించి తెలిస్తే తెలిసినట్టు మాట్లాడాలి.  అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదని బీజేపీ నేతలు హెచ్చరించారు.  కాంగ్రెస్ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు మద్యం విషయం మీద కంటే.. చరిత్రను తప్పుగా పిల్లలకు తెలిపేందుకు అనువుగా ఉన్నాయని అన్నారు.  కాంగ్రెస్ నేత చెప్పిన తప్పుడు చరిత్రను పిల్లలను తెలుసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో అని బీజేపీ నేత తెలిపారు.  బీజేపీ ఈ విషయంపై రగడ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: