చింతమనేని బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారించిన ఏలూరు జిల్లా కోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దళితులను దూషించిన కేసులో అరెస్టైన చింతమనేనికి కోర్టు గతంలోనే బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనపై ఉన్న పాతకేసులు ఒక్కొక్కటిగా విచారణకు రావడంతో పలు కేసుల్లో కోర్టు రిమాండ్ విధించింది. ఒక కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో రిమాండ్ విధించడంతో చింతమనేని విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. 
   
చింతమనేనిపై ఉన్న కేసులన్నింటిలో బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై ఉన్న సుమారు 18 కేసుల్లో ఏలూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు బెయిల్ మంజూరైనప్పటికీ శనివారం మధ్యాహ్నం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


దళితులను దూషించిన కేసులో అరెస్టైన చింతమనేనికి కోర్టు గతంలోనే బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనపై ఉన్న పాతకేసులు ఒక్కొక్కటిగా విచారణకు రావడంతో పలు కేసుల్లో కోర్టు రిమాండ్ విధించింది. ఈ రోజు చింతమనేని బెయిల్ పిటిషన్‌పై విచారించిన ఏలూరు జిల్లా కోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో రెండు నెలల తరువాత చింతమనేని జైలు నుంచి విడుదల కానున్నారు.


పోలీసులు అరెస్టు చేసిన చింతమనేనిని కోర్టులో హాజరు పరచడంతో న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. వెంటనే ఆయనను ఏలూరు జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న చింతమనేనికి బెయిల్ మంజూరులో వింత పరిస్థితి ఎదురైంది. ఒక కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో అరెస్టు చేయడంతో ఆయన జైలుకే పరిమితమయ్యారు. 66 రోజుల తరువాత అన్ని కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రేపు విడుదల కానున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: