కడుపుకి అన్నం తినేవాడెవడూ వైసీపీలో చేరడని, వార్డుమెంబర్‌గా కూడా పనికిరాని   వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అని, ఆయనపార్టీలో ఎవరుచేరుతాడని గతంలో అనేక సందర్భాల్లో చెప్పిన వల్లభనేని వంశీ, ఇప్పుడు ఎలావైసీపీలో చేరుతున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్లరామయ్య ప్రశ్నించారు. తెలుగుదేశంపార్టీవల్లే వంశీ లబ్ధిపొందాడని, ఆయనపై పెట్టిన కేసులన్నీ టుంబ్రీకేసులని, టీడీపీ అధినేత చంద్రబాబుని కలవడానికి వచ్చినప్పుడే ఈ విషయం వంశీకి స్పష్టంగా చెప్పానని రామయ్య  తెలిపారు. 

జగన్‌కి  చదువుసంధ్యల్లేవని, అవగాహనలేదని, ఆయన వార్డ్‌మెంబర్‌గా కూడా గెలవలేడన్న వంశీ, సాక్షి దొంగపేపర్‌ అని, దాన్ని అవినీతి సొమ్ముతోపెట్టారని చెప్పిన వంశీ, నేడు జగన్మోహన్‌ రెడ్డి పంచన ఎందుకుచేరాడో, ఎందుకు ఆయనతో కలిసినడవాలనుకుంటున్నాడో వంశీనే సమాధానం చెప్పాలన్నారు. అన్నంతినే వాళ్లెవరూ, వైసీపీలో చేరరని చెప్పిన వ్యక్తే, ఇప్పుడు జగన్‌ ఆదేశిస్తే ఆయనతో ఉంటానని చెప్పడం దారుణమన్నారు. తనకేదో సమస్య ఉందని,  ఆనాడు టీడీపీ అధినేతతో సమావేశమైనప్పుడు కేసులగురించి భయపడినట్లు తమ ముందు వంశీ నటించాడని, వైసీపీలోకి వెళ్లడానికి అప్పటికే ఆయన సిద్ధమైపోయాడని వర్ల పేర్కొన్నారు. 


టీడీపీ సీనియర్‌నేత, ఎమ్మెల్సీ వైవీబీ.రాజేంద్రప్రసాద్‌ని ఉద్దేశించి, ఒక టీవీఛానెల్‌ కార్యక్రమంలో బూతులుమాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అయన అయ్యప్పమాలలో ఉన్నాడనేది కూడా మర్చిపోయి, తనకన్నా పెద్దవాడైన రాజేంద్రప్రసాద్‌ని, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి పరుషంగా మాట్లాడటం, అంతుచూస్తానని బెదిరిం చడం, తీవ్ర అభ్యంతరకరమని, వంశీవ్యాఖ్యలను, చర్యలను, టీడీపీ తరుపున ముక్తకంఠం తో ఖండిస్తున్నామని రామయ్య తేల్చిచెప్పారు. 


వంశీ గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లం దరిపైనా ఆయన ఎదురుదాడి చేస్తాడా అని రామయ్య ప్రశ్నించారు. వంశీకి టీడీపీ సీటు ఎలావచ్చిందో, ఎవరిద్వారా వచ్చిందో ఆయనకు తెలియదా అన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య ప్రజానాయకులని, వారు  ప్రజాసేవలో ఉండ ట్టే, వారికి సీట్లు వచ్చాయన్నారు. వంశీ ఏదో ఆశించి, ఏవో ప్రలోభాలకు లొంగి, పార్టీ మారాలనుకుంటే మారవచ్చని, వెళ్లేక్రమంలో టీడీపీపై, ఆపార్టీనేతలపై ఇష్టానుసారం మాట్లాడటం మాత్రం సరికాదన్నారు. 


భారతదేశంలో జగన్‌ని మించిన అవినీతిపరుడు  లేడని, తనసంపాదనంతా తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని సంపాదించినదేనన్న వంశీని అక్కున చేర్చుకోవాలని తహతహలాడుతున్న జగన్మోహన్‌రెడ్డి, నైతికత అనేపదానికి కొత్త నిర్వచనం చెప్పాడని వర్ల ఎద్దేవాచేశారు. వంశీ తప్పటడుగు వేశాడని, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని, తన సన్నిహితులు, కుటుంబసభ్యులే అంగీకరించే స్థితిలోలేరని రామయ్య  స్పష్టంచేశారు. తల్లిలాంటి టీడీపీని వదిలి, సవతితల్లి పంచనచేరడానికి వంశీ తాపత్రయప డుతున్నాడని, ఆయనకు త్వరలోనే జ్ఞానోదయం అవుతుందని వర్ల తెలిపారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: