ఉన్నట్టుండి ఒక్కసారిగా వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు లో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఎవరూ ఊహించని విధంగా వార్తల్లోకెక్కిన జమ్మలమడుగు నగరంలోని బీడు భూములు సైతం ఒక్కసారిగా బంగారం పండించడం మొదలెట్టాయి. దీనంతటికీ కారణం కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మండలంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పై ప్రజల్లో భరోసా భారీగా పెరిగిపోయి జమ్మలమడుగు మండలంలో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గత ఐదేళ్లు టిడిపి పాలనలో తమకు చట్టబద్ధంగా రావాల్సిన ఒక కర్మాగారం కోసం కడప జిల్లా వాసులు చేయని పోరాటం లేదు కానీ బాబు గవర్నమెంట్ ఏమాత్రం దానిపై శ్రద్ద పెట్టలేదు.

2007లో చిటిమిటి చింతల వద్ద బ్రాహ్మణి స్టీల్ప్లాంట్ నిర్మాణానికి  అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. రూ.20వేల కోట్లతో దీనిని నిర్మించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్రెడ్డి అప్పట్లో ముందుకు వచ్చారు. వివిధ కారణాల వల్ల అది నిర్మాణం కాలేదు. తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీలో...ఉక్కు కర్మాగారం ప్రకటన వెలువడటంతో... జమ్మలమడుగు మండలంలో భూమి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి సారథ్యంలో గతంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరిగి ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయాయి. మళ్లీ ఆయన తనయుడు జగన్ నేతృత్వంలో ఉక్కు కర్మాగారం వచ్చి తీరుతుందని జిల్లాప్రజలు ఆశిస్తున్నారు.

ఇప్పుడు కడప జిల్లాలో ప్రొద్దుటూరు మరియు జమ్మలమడుగు ప్రాంతం మధ్యలో ఎక్కడ ఒక ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తామని జిల్లా వాసులకు హామీ ఇచ్చారు. 2020 జనవరి 26న స్టీల్ ప్లాంటుకు పునాదిరాయి వేస్తానని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు 250 కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా ప్రకటించారు.దీంతో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు ముందు ఎకరానికి నీటిపారుదల భూమి ధర 7 నుంచి 10 లక్షల రూపాయలకు పెరిగితే తాజాగా 50 లక్షల భూమికి పెరిగిందని, బీడు భూముల ధరలు అంతకుముందు ఐదు లక్షల కంటే 25 లక్షలకు పెరిగాయని సమాచారం. ఈ అనూహ్య మార్పు తో కడప జిల్లా వాసులు ఇన్నాళ్ళకి తమ కోరిక ఫలించిందని సంబరాలు చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: