తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్‌ అన్ని వైపులా టార్గెట్ అవుతున్నారు. ఇప్ప‌టికే, పార్టీని న‌డిపించే సామ‌ర్థ్యం లేద‌ని ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్న త‌రుణంలో...తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. `లోకేష్ టీడీపీకి పెద్ద గుదిబండ. జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి పప్పు భయపడుతున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ కనుమరుగవుతుంద‌ని జోస్యం చెప్పారు.


ఎన్నికల్లో త‌నతోపాటు చాలా మందికి టికెట్లు ఇచ్చారని.... వాళ్లంతా గెలిచిరా? అని వంశీ ప్ర‌శ్నించారు. లోకేష్ మాటల వల్లే ఇంతలా స్పందిస్తున్న‌ట్లు తెలిపిన వంశీ.. టీడీపీకి లోకేష్ ఓ పెద్ద గుదిబండ... టీడీపీకి లోకేష్ పెద్ద స్పీడ్ బ్రేకర్.. లోకేష్‌తో పార్టీ ముందుకు వెళ్లలేదని వ్యాఖ్యానించారు. నేను వెళ్తే టీడీపీకి నష్టం లేదు.. కానీ, లోకేష్ పార్టీలో ఉంటేనే పెద్ద నష్టం అంటూ విమర్శలు గుప్పించారు ``మంగళగిరిలో పప్పు ఎందుకు గెలవలేదు?`` అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ వీడిన సుజనా చౌదరితో లాంటి వాళ్లతో ఉంటేనే మంచిదని.. చంద్రబాబు, పప్పు లాంటి వాళ్లతో తిరిగితే ఎవరికైనా నిరాశే వస్తుందని వంశీ వ్యాఖ్యానించారు. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీ చేయాలని సవాల్ విసిరారు. 


పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు పేర్కొంటూ టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన తీరుపై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు. 'నన్ను టీడీపీ సస్పెండ్ చేయడమేంటి?. నేను ముందే టీడీపీకి రాజీనామా చేశా. టీడీపీ ఇచ్చే షోకాజ్ నోటీసులకు స్పందించాల్సిన అవసరం లేదు. నాకు హైదరాబాద్‌లో ఆస్తులు ఎక్కడున్నాయో పప్పు ఆధారాలు చూపించాలి. చంద్రబాబుపై ఉన్నట్లు.. నాపై ఓటుకు కోట్లు కేసులు లేవు. టికెట్ ఇచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. తన రెండెకరాల పొలంతోనే చంద్రబాబు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారా? చంద్రబాబు వ్యవసాయం చేసి ఏమైనా పార్టీ ఫండ్ ఇచ్చారా? అని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: