ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దేవినేని అవినాష్ తన రాజకీయ ఆరంగ్రేటం తండ్రితో కలిసి తెదేపాలో మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా చేరిన వెంటనే తెలుగు యువత అధ్యక్షుడి పదవి దక్కింది. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ దక్కడానికి అతనికి ఎలాంటి ఆటంకం కలగలేదు. ఇలా రాజకీయాల్లో పార్టీలో చేరిన వెంటనే అవకాశాలు కలిసి రావడం మరియు ఉన్నత పదవి చేపట్టడం చాలా అరుదు. అయితే వచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దేవినేని అవినాష్ చేజార్చుకున్న తీరు కూడా ఇప్పటి తరం వారికి గుణపాఠమే.

అయితే ఆ తరువాత కొడాలి నాని ముందు  అవినాష్ నిలబడలేకపోయారు. వరసగా నాని మరోసారి  గెలవగా అవినాష్ భారీగా ఖర్చు పెట్టుకుని ఓడిపోయారని స్థానికులు అంటారు. ఇక తెలుగుదేశం అధికారంలోకి కూడా రాకపోవడంతో.. అవినాష్ అంతిమంగా వైసీపీలోకి చేరారు.అయితే ఇప్పుడు ఆయనకు గుడివాడలో అయితే ప్రాధాన్యత దక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన  మంత్రి కూడా! జగన్ కు సన్నిహితుడుగా కొడాలి నానికి పేరుంది.

ఇటువంటి పరిస్థితుల్లో గుడివాడ నియోజకవర్గం విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తే మాత్రం అవినాష్ కూరలో కరివేపాకే అవుతారు. అయితే ఇదే కృష్ణాజిల్లాలో మరేదైనా నియోజకవర్గంలో ఆయన దృష్టి పెడితే మంచిదని రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే జిల్లా మొత్తం ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కిటకిటలాడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్చార్జిలుగా ఉన్న ఈ జిల్లాలో తెలుగుదేశం చేతిలో ఉన్న ఏదో ఒక నియోజకవర్గం పైన అవినాష్ దృష్టిసారిస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుందని... అంతేగాని ఒక నియోజకవర్గం పట్టుకుని కూర్చుంటే చివరికి జరిగేది ఏమీ లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: