గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వేసిన పాచిక పారింది . టీడీపీ నాయకత్వం తనని సస్పెండ్ చేయాలని భావించి, ఆ పార్టీ  నాయకత్వం పై వంశీ తీవ్రస్థాయి  విమర్శలు చేసిన విషయం తెల్సిందే . టీడీపీ నుంచి తనని సస్పెండ్  చేస్తే, ఆ పార్టీ  శాసనసభా పక్షం … తనపై అనర్హత వేటు వేయాలని  స్పీకర్ కు  ఫిర్యాదు చేసే అవకాశం ఉండదని  వంశీ అంచనా వేశారు . దాంతో తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండా, వైకాపా అనుబంధ సభ్యుడిగా వెసులుబాటు లభిస్తుందని వంశీ భావించారు .


 అందుకే   టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై  వంశీ ఒంటికాలిపై లేస్తూ విమర్శలు గుప్పించడమే కాకుండా , తాను వైకాపా అధినేత , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తానని ప్రకటించారు .  టీడీపీ  నాయకత్వం పై విమర్శలు చేసిన వంశీ మోహన్ ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు . వంశీ వేసిన ఎత్తుగడ తెలిసి నా , పార్టీ అధినేత , జాతీయ ప్రధాన కార్యదర్శి పై  తీవ్ర విమర్శలు చేసిన వంశీ మోహన్ ను ఇక ఎంతమాత్రం ఉపేక్షించరాదని సస్పెన్షన్ వేటు వేసింది . 


తనపై టీడీపీ నాయకత్వం వేటు వేయడం పై వంశీ స్పందిస్తూ తనని టీడీపీ నాయకత్వం సస్పెండ్ చేయడం ఏమిటనీ, తానే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు కు రోషం ఉంటే పార్టీ మారిన రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయాలని దీక్ష చేయాలని సూచించారు . నల్లబట్టలతో ప్రధాని మోడీ , హోంశాఖ మంత్రి అమిత్ షా కు వ్యతిరేకంగా దీక్ష చేయగలరా అంటూ ప్రశ్నించారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: