గుజరాత్‌లోని సబర్మతీ తీరంలో అక్టోబర్‌ 30, 1948న నాథూరాం గాడ్సే చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. హత్యానంతరం గాడ్సేని దోషిగా తేల్చి చట్టపరంగా ఉరి తీశారు. ఈ విషయం అందరికీ తెలుసు కానీ ఒడిశా విద్యా శాఖ మాత్రం గాంధీ ది హత్య కాదు ప్రమాదం అంటోంది, అవును జాతిపిత మహాత్మా గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయారంటూ ఒడిశా విద్యా శాఖ ప్రచురించిన బుక్‌లెట్‌ తీవ్ర వివాదాస్పమైంది. దీనిపై రాజకీయ నేతలు ఉద్యమకారులు ఒడిశా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల సందర్బంగా ఆమా బాపూజీ: ఏక్ ఝలకా (మన బాపూజీ: ఒక సంగ్రహ అవలోకనం) పేరిట ప్రచురించిన రెండు పేజీల బుక్‌లెట్‌లో గాంధీకి సంబంధించిన విషయాలు వివరించారు. ఈ క్రమంలో 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు. ఇక ఈ విషయం తీవ్ర వివాదాస్పదం అవ్వడం తో ఒడిశా విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ వివాదాస్పదానికి దారితీసిన అంశం ఎలా ప్రచురితమైందనే విషయంపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే బుక్‌లెట్‌లను ఉపసంహరించుకున్నామని తెలిపారు.
ఇక ఈ విషయమై ఒడిశా అసెంబ్లీ దద్దరిల్లింది,  ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అధికార పార్టీని నిలదీసింది. మీరు చరిత్రను తిరగరాయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ఈ అంశంపై అసెంబ్లీలో సీఎల్పీ లీడర్‌ నరసింహ్‌ మిశ్రా మాట్లాడుతూ "గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేశాడని, అనంతరం అతనిని ఉరి తీశారని తెలీదా?" అని ప్రశ్నించారు.ఈ తప్పుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని, ఒకవేళ ముఖ్యమంత్రికే ఇందులో భాగస్వామ్యం ఉంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.
ఇక ఈ విషయం పై దర్యాప్తు కి ఆదేశించింది ఒడిశా సర్కార్. అయితే సీఎం నవీన్ పట్నాయక్ మాత్రం ఈ ఘటన పై స్పందించలేదు కానీ అధికార పార్టీ నేతలు ఈ ఘటన ను ఖండించారు, ఈ ఘటన కు కారకులైనవారిని శిక్షిస్తామని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: