తెలుగుదేశం పార్టీ వీడి వైకాపా లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షం లో చేరిన దేవినేని అవినాష్ కు పార్టీ లో ఎటువంటి ప్రాధాన్యత దక్కుతుందన్నది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది . తండ్రి దేవినేని నెహ్రూ తో కలిసి టీడీపీ లో చేరిన వెంటనే అవినాష్ కు ఆ పార్టీ నాయకత్వం యువత అధ్యక్ష పదవి  కట్టబెట్టింది .  అసెంబ్లీ ఎన్నికల్లో  గుడివాడ టికెట్ ను కేటాయించింది . గుడివాడ లో అవినాష్ స్థానికేతరుడు కావడం , కొడాలినాని అప్పటికే వరుసగా గెలుస్తూ వస్తున్న ఎమ్మెల్యే కావడం తో గట్టి పోటీ ఇవ్వగలిగారు  కానీ గెలువలేకపోయారు .


అవినాష్ ఓడిపోవడం, టీడీపీ అధికారం లోకి రాకపోవడం తో అవినాష్ తన రాజకీయ భవిష్యత్తు కోసం వైకాపా లో చేరారు . అయితే వైకాపా నాయకత్వం ఆయనకు ఎటువంటి హామీ ఇచ్చిందన్న దానిపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది . మరో నాలుగున్నర ఏళ్ల వరకు ఎన్నికలు ఎలాగూ లేవు కాబట్టి , ఈ నాలుగున్నర ఏళ్ల వరకు పార్టీ పదవో , నామినేట్ పదవి తోనో సరిపెట్టుకోవాల్సిందే . ఇక ప్రతిపక్షం లో ఉన్న పార్టీ పదవి లో కొనసాగడం కంటే , అధికార పార్టీ పదవి లో కొనసాగితే ఉండే ప్రాధాన్యత వేరుగా ఉంటుందనేది నిర్వివాదాంశమే .


ఇక నామినేటెడ్ పదవి దక్కితే తన వెంట నడిచే క్యాడర్ ఎంతో, కొంత మేలు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది . అయితే అంతిమంగా రానున్న ఎన్నికల్లో అవినాష్ కు ఎక్కడి నుంచి వైకాపా నాయకత్వం టికెట్ కేటాయిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది . ఎందుకంటే గుడివాడ నుంచి తిరిగి అవినాష్ పోటీ చేయాలనుకోవడం లేదు .. వైకాపా నాయకత్వం కేటాయించే ఛాన్స్ లేదు . ఇక విజయవాడ పరిసరా అసెంబ్లీ సెగ్మెంట్లను చూసుకోవాల్సిందే . అయితే అక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉంది .


మరింత సమాచారం తెలుసుకోండి: