ఈ కాలంలో నిజాయితీగా బ్రతికే వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చూ. అందరు మాటలు చెప్పేవారే కాని విషయం వారి వరకు వచ్చేసరికి మాటల్లో తేడా వస్తుంది. ఇకపోతే ఇప్పుడున్న పరిస్దితుల్లో కట్నం తీసుకోకుండా పెళ్లిచేసుకునే వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎంత లేనివాడైన సరే అతని స్దాయికి తగ్గట్టుగా కట్నకానుకలు పుచ్చుకుంటాడు. మరికొందరు సమాజంలో తోడేలు తోలు కప్పుకుని తిరుగుతుంటారు.


వీరికి కట్నం ఎంతగా ముట్టచెప్పినా నూతిలో నీటిని చేదినట్లుగా అత్తగారి సొమ్మును మాటి మాటికి తెప్పించుకుంటారు అయినా తృప్తి పడరు. ఇలాంటి వారిలో మంచి మంచి ఉద్యోగాలు చేసేవారు. ప్రభుత్వంలో కొలువులు చేసేవారు. అధిక విద్యావంతులు ఉన్నారు. ఇలాంటి వారి ధనదాహానికి ఎంతమంది అబలలు బలయ్యారో తెలియదు. ఇకపోతే ఓ బుద్ధిమంతుడు పిలిచి పిల్లతో పాటుగా కట్నం ఇస్తానంటే ససేమిరా వద్దన్నాడు.


ఇక కట్నం తీసుకోవడం  చట్టపరంగా నేరమే అయినా ఈ కాలంలో కట్నం తీసుకోని వారుండరు. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే అడిగినంత కట్నం ఇవ్వలేదని ఆగిపోయిన పెళ్లిళ్ల గురించి వినే  ఉంటాం. మరి ఇలాంటి ఈ రోజుల్లో రూ.11 లక్షల కట్నం వద్దని ఓ జవాను అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. బదులుగా రూ.11, కొబ్బరికాయను మాత్రమే  కట్నంగా స్వీకరించాడు.. ఇంతటి బుద్దివంతుడు, గుణవంతుడు ఉండేది ఎక్కడంటే రాజస్థాన్ లోని జైపూర్లో.  అతని పేరు జితేందర్. ఇతడు జైపూర్ సీఐఎస్ ఎఫ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. 


ఈ నెల 8న ఆయన వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.11 లక్షలు నగదు అమ్మాయి తండ్రి కట్నం కింద పళ్లెంలో పెట్టి ఇవ్వబోయాడు. అయితే జితేందర్ ఆ డబ్బులు వద్దని కేవలం రూ.11, కొబ్బరికాయను కట్నంగా స్వీకరించాడు. ఇలా ఎందుకు చేసాడో తర్వాత చెప్పిన ఆయన మాటలు అక్కడున్న వారందరినీ కదిలించాయి. తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి రాజస్థాన్ జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతోందని,


ఒకవేళ అమె మేజిస్ట్రేట్ అయితే అదే తనకు పెద్ద కట్నం అని చెప్పాడు. ఈ విషయానికి సంబంధించి వధువు తండ్రి గోవింద్ సింగ్ మాట్లాడుతూ మా అల్లుడు కట్నం వద్దనడంతో మొదట నేను షాకయ్యాను. పెళ్లికి చేసిన ఏర్పాట్లు నచ్చక కట్నం వద్దంటున్నారని అనుకున్నా. కానీ తర్వాత కట్నం వద్దనటానికి గల కారణం తెలిసి చాలా సంతోషపడ్దా ఇలాంటి వారు ఊరుకు ఒక్కరున్న చాలు సమాజం బాగుపడుతుందని తెగ మురిసిపోయాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: