తెలుగుదేశం పార్టీ కి కమ్మ సామాజిక వర్గ నేతలు ఒకొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు .  ఆ పార్టీకి తాజాగా  గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ మోహన్ , దేవినేని అవినాష్ లు ఇద్దరు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే కావడం విశేషం . 2014 లో టీడీపీ అధికారం లోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకత్వం కమ్మ సామాజిక వర్గ నేతలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి , ఇతర సామాజిక వర్గాల వారిని చిన్నచూపు చూసిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి . టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బిసిలు , దళితులు , మైనార్టీలు దన్నుగా నిలుస్తూ వచ్చారు .


ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పార్టీ  అధికారం లోకి రావడానికి, రాష్ట్ర విభజన అనంతరం  టీడీపీ అధికారం చేజిక్కించుకోవడం లో ఆయా  సామాజికవర్గాలు కీలకపాత్ర పోషించాయి . అయితే రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్న కులాలను కాదని , కమ్మ సామాజిక వర్గ నేతలకు పెట్టపీట వేయడం తో , ఇన్నాళ్లూ పార్టీ ని నమ్ముకుని గెలిపిస్తూ వచ్చిన వర్గాలు క్రమేపీ దూరమయ్యాయి . ఇక అధికారం ఉన్నన్నినాళ్ళు  అన్ని తామే అన్నట్లు వ్యవహరించిన కమ్మ నేతలు , పార్టీ అధికారానికి దూరమైన తరువాత ఒకొక్కరుగా పార్టీని వీడి  తమ దారిని తాము చూసుకుంటున్నారు .


టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి పదవి , రెండు సార్లు రాజ్యసభ పదవి దక్కించుకున్న సుజనా చౌదరి పార్టీ ఫిరాయించి బీజేపీ లో చేరిన విషయం తెల్సిందే . సుజనా ఒక్కడే పార్టీని వీడకుండా తనతోపాటు మరో ముగ్గుర్ని పట్టుకెళ్లారు . ఇలా ఒక్కరు కాదు ... పలువురు పార్టీని వీడుతూ టీడీపీ అధినేతకు ఝలక్ ఇస్తున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: