ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో రాజకీయ నేతలకు మహా అంటే పది , పదిహేనేళ్ల పరిచయం ఉందంటే ఎవరైనా నమ్ముతారు... కానీ పాతికేళ్ల నుంచి పరిచయం ఉందంటే మాత్రం కాసింత సంశయిస్తారు . ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రియాశీలక రాజకీయాల్లో వచ్చాకే , రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నేతలతో  పరిచయాలు ఏర్పడ్డాయన్నది నిర్వివాదాంశం . జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు కావడంతో , కొంతమంది రాజకీయ  నాయకులతో పరిచయాలు ఉండడం అన్నది సర్వసాధారణమే .


కానీ అదికూడా పాతికేళ్ల పరిచయం ఉండే అవకాశాలు ఎంతమాత్రం లేదు . కానీ తనకు జగన్మోహన్ రెడ్డి తో పాతికేళ్ల పరిచయం ఉందని గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ పేర్కొనడం ఆశ్చర్యం అన్పించడమే కాదు .. అతి చేస్తున్నాడనే విమర్శలు విన్పిస్తున్నాయి . జగన్ తో పాతికేళ్ల పరిచయం ఉందంటే స్కూల్ డేస్ నుంచే పరిచయం ఉండి ఉండాలని కానీ వంశీ మోహన్ హైదరాబాద్ లో చదివిన దాఖలాలు  లేవని , మరి అటువంటప్పుడు ఆయనకు జగన్ తో పాతికేళ్ల కిందట పరిచయం ఉండే అవకాశాలే లేవన్న వాదనలు విన్పిస్తున్నాయి .


వంశీ , జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసమే ఈ తరహా డైలాగ్ చెప్పి ఉంటారని  రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . టీడీపీ కి గుడ్ బై చెప్పిన వంశీ , వైకాపా లో చేరకుండా అనుబంధ శాసనసభ్యునిగా కొనసాగే ప్రయత్నాన్ని చేస్తున్నారని అంటున్నారు   . ఈ  క్రమం లో టీడీపీ నాయకత్వం పై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా , జగన్ మెప్పు కోసం ఆయన లోకేష్ ను వ్యక్తిగత విమర్శలతో  టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తోందని పేర్కొంటున్నారు  .

మరింత సమాచారం తెలుసుకోండి: