పశ్చిమ గోదావరి జిల్లాలో congress PARTY' target='_blank' title='వైయస్‌ఆర్‌సీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. భీమడోలు మండలం అంబరుపేటలో భూ వివాదం నేపథ్యంలో congress PARTY' target='_blank' title='వైయస్‌ఆర్‌సీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త పసుపర్తి కిశోర్‌పై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కిశోర్‌ అక్కడిక్కడే మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సోదరుడు గోపాలం ప్రోదర్భలంతో టీడీపీ కార్యకర్తలు దాడి చేసి చంపారని మృతుని బంధువులు పేర్కొన్నారు.


భీమడోలు మండలం అంబరుపేటలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. భూవివాదం నేపథ్యంలో పసుపర్తి కిశోర్‌పై దుండగులు రాడ్లతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన కిశోర్‌ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సోదరుడు గోపాలం ప్రోద్బలంతో టీడీపీ నాయకులు దాడిచేసి చంపారని కిశోర్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు చేరుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఆందోళన చేసారు. మరోవైపు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి కూడా పిలుపు ఇచ్చారు. అప్పట్లో అది చాలా కలకలం సృష్టించింది. ఇప్పుడు అధికార పార్టీ కార్యకర్త హత్యకు గురవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.


ప్రతి జిల్లాలోనూ వైసీపీ కార్యకర్తల చేతిలో టీడీపీ కార్యకర్తలు హత్యలకు గురవుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ.. పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఏదేమైనా హింసా రాజకీయాలను ప్రోత్సహించడం ఏ పార్టీకీ మంచిది కాదు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. రాజకీయాల్లో అధికారాలు మారుతుంటాయి. ఒక పార్టీ హవా కొన్ని రోజులు ఉంటే.. మరో పార్టీ హవా ఇంకొన్ని రోజులు ఉంటుంది. అందుకని ఇలా ప్రాణాలను బలి తీసుకోవడం మాత్రం అన్యాయం. అది ఏ పార్టీ చేసినా ఖండించాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: