ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తాజాగా ఓ ఆరోపణ చేశారు. భవన నిర్మాణ కార్మికుల్లో అత్యధిక శాతం బీసీలేనని చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం జగన్ కు బీసీలంటే కక్ష అని.. అందుకే ఇసుక విధానంలో ఆలస్యం చేసి వారి పొట్టకొట్టారని ఆరోపించారు. ఇలా కార్మికుల్లోనూ కులాలను చూసిన చంద్రబాబు రాజకీయాన్ని వైసీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. తెలుగు దేశం పార్టీ బీసీలను వాడుకొని వదిలేసిందని వైసీపీ బీసీ నాయుకులు అంటున్నారు.


అన్ని కులలను న్యాయం జరిగేలా congress PARTY' target='_blank' title='వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. సంచార జాతిలో ఉన్న కులాలకు బడ్జెట్లో నిధులు కేటాయించారని జంగా కృష్ణమూర్తి తెలిపారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం సంచార జాతుల ఆవేదనను వినిందని చెప్పారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారని జంగా కృష్ణమూర్తి తెలిపారు.


ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, దానికి ఆర్థిక పరిపుష్టి కల్పించే విధంగా వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలిచి ఓ సమావేశం ఏర్పాటు చేసి సీఎం సలహాలు, సూచనలు తీసుకున్నారన్నారు. సమాజంలో మార్పు రావాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్య ఉద్దేశమన్నారు. పేదలందరికీ నాణ్యమైన విద్యనందించాలని, అది కూడా ఇంగ్లీష్‌ మీడియం చదువులు చెప్పించాలని సీఎం పట్టుదలతో ఉన్నారని జంగా కృష్ణమూర్తి అన్నారు.


చేనేత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుపై చర్చించారని జంగా కృష్ణమూర్తి తెలిపారు. కార్పొరేషన్‌ చైర్మన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నామినేటేడ్‌ పదవులు కూడా 50 శాతం ఇస్తారని చెప్పారు. మార్కేట్‌ యార్డు, దేవాలయాల్లో పదవులు 50 శాతం ఈ వర్గాలకే ఇస్తారని జంగా కృష్ణమూర్తి తెలిపారు. బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారని, బీసీ వర్గాలు తమ సమస్యలను కమిషన్‌ దృష్టికి తీసుకురావాలన్నారు. కులాలకు సంబంధించిన ఏ సమస్యనైనా ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. బీసీలను మోసం చేసిందే పార్టీ.. న్యాయం చేసిందేపార్టీ ప్రజలే తేల్చుకుంటారని కృష్ణమూర్తి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: