చిరంజీవి తన నెంబర్ వన్ స్థానాన్ని పణంగా పెట్టి ప్రజారాజ్యం పెట్టి ఎన్నికలకు వెళ్లాడు. పార్టీ పెట్టిన సమయంలోనూ, పెట్టిన కొన్నాళ్లకు ఎంతటి క్రేజ్ ఉందో ఎంతటి సంచలనం సృష్టించాడో తెలిసిందే. అయితే ఒక్కసారిగా ప్రజారాజ్యం కొడిగొట్టిన దీపంలా మారిపోయింది. పార్టీలో కీలకపాత్ర పోషించిన పరకాల ప్రభాకర్.. ప్రజారాజ్యంకు రాజీనామా చేసిన నాటి నుండి పరిస్థితులు మారిపోయాయి. పార్టీ ఆఫీసులో కూర్చునే ప్రెస్ మీట్ పెట్టి ప్రజారాజ్యంను తిట్టి సంచలనం రేపాడు. టీడీపీ కోవర్టుగా పని చేసాడని అప్పట్లో అన్నారు కూడా.

 

 

ప్రస్తుతం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు నిర్మలా సీతారామన్. కానీ.. ఇటివల పరకాల ప్రభాకర్ ఆర్ధిక శాఖపై పలు విమర్శలు కూడా చేశాడు. దీంతో పరకాలకు ఓ వ్యాపకం చూడాలనే ఉద్దేశ్యంతో.. ఓ టీవీ ఛానెల్ లో ప్రముఖ పాత్ర పోషించే బాధ్యతను ఇప్పించేందుకు ఆమె పావులు కదిపారని సమాచారం. రాష్ట్రంలో ఓ వర్గానికి వంతపాడే ఆ టీవీ ఛానెల్ లో పరకాల తన వాగ్దాటిని డిసెంబర్ నుంచి చూపనున్నాడని అంటున్నారు. ఈయన కార్యక్రమానికి ఓ సినీ సంగీత దర్శకుడు ట్యూన్స్ ఇవ్వనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. . మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే డిసెంబర్ వచ్చే వరకూ ఆగాల్సిందే.  

 


ప్రజారాజ్యం నుంచి బయటకొచ్చాక ఆయన టీడీపీలో చేరి చంద్రబాబు హయాంలో కీలక పాత్ర పోషించాడు. కొన్నాళ్లు బాగానే సాగినా.. ఆయన హవాను టీడీపీ తట్టుకోలేకపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. తన భార్య నిర్మలా సీతారామన్ కేంద్రంలో మంత్రి పదవిలో ఉన్నందును తాను ఇక్కడ పదవిలో ఉండలేనని చెప్పుకున్నా లోపల జరిగింది వేరని అంటారు. మరి బుల్లితెరపై పరకాల ఏమేర సక్సెస్ అవుతాడో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: