హైదరాబాద్ లోని అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో జేఏసీ నేత అశ్వత్థామరెడ్డిపై కేసు నమోదైంది. మాలమహానాడు అధ్యక్షుడు దీపక్ కుమార్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ జేఎసీ కో కన్వీనర్ రాజిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీపక్ కుమార్ ఫిర్యాదులో ఇప్పటివరకూ సమ్మె ఉధృతంగా సాగిందని ఉధృతంగా సాగుతున్న సమ్మెను జేఏసీ నేతలు నీరుగార్చుతున్నారని పేర్కొన్నాడు. 
 
ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైన తరువాత ఇప్పటివరకు 23మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 23 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న తరువాత ప్రధాన డిమాండ్ అయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంపై ఇప్పుడు వెనక్కు తగ్గటం ఏమిటని దీపక్ కుమార్ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చించే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ వాయిదా వేశారా...? అని దీపక్ కుమార్ ప్రశ్నించారు. 
 
ప్రభుత్వానికి అనుకూలంగా జేఏసీ నేతలు అడుగులు వేస్తున్నారని అనుమానం కలుగుతోందని దీపక్ కుమార్ చెప్పారు. దాదాపు 50,000 మంది కార్మికులు డిమాండ్లను సాధించుకోవటం కోసం ఉద్యోగాలను, జీత భత్యాలను వదులుకొని సమ్మె చేస్తున్నారని దీపక్ కుమార్ అన్నారు. ఇలాంటి సమయంలో జేఏసీ నేతల తీరు మాత్రం బాధ కలిగిస్తుందని దీపక్ కుమార్ అన్నారు. మైనారిటీ సంఘాలు, గిరిజన సంఘాలు, ఎమ్మార్పీఎస్ సంఘాలు, మాల మహానాడు సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతుగా నిలుస్తాయని దీపక్ కుమార్ అన్నారు. 
 
మరోవైపు ఆర్టీసీ కార్మికులు గుండెపోటుతో చనిపోతున్నా, ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల కొరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల ప్రజాప్రయోజనాలతో ఈ పిటిషన్ ముడిపడి ఉందని పిటిషనర్ పిటిషన్ లో పేర్కొన్నారు. తెలంగాణ జన సమితి కన్వీనర్ ఈ పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్ లో కార్మికుల జీతాలుచెల్లించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పిటిషనర్ విశ్వేశ్వరరావు పిటిషన్ లో పేర్కొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: