అతి అనేది అన్ని అనర్ధాలకు మూలం అని తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు సమాజాన్ని శాసిస్తుంది డబ్బు. ఈ డబ్బు ప్రాణాలను పోస్తుంది. అదే డబ్బు ప్రాణాలను తీస్తుంది. ఇప్పుడు లోకంలో డబ్బు కోసమే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. ఇదే డబ్బు మనుషుల మధ్య బందాన్ని బలపరిస్తే. ఇదే డబ్బు అనుబందాలను తెంచుతుంది. మనుషుల మధ్య చిచ్చు పెట్టి పగవారిగా మార్చుతుంది. అందుకే అంటారు డబ్బుకు లోకం దాసోహం అని.


ఈ డబ్బును జాగ్రత్తగా వాడుకుంటే ఆనందాన్ని ఇస్తుంది. ఇదేడబ్బును విచ్చలవిడిగా వాడటం మొదలు పెడితే విషాదాన్ని కూడ పంచుతుంది. ఒక్క రూపాయైన, వేయిల కోట్లైనా డబ్బు డబ్బే. అందుకే సామాన్యుల నుండి రాజకీయనాయకులు, లక్షల్లో జీతాలు పొందే అధికారులు కూడ డబ్బంటే మోజు పడతారు. ఇంతగా లోకంలో అవినీతి పెరిగిపోతుందంటే కారణం మనిషికి డబ్బు మీద వ్యామోహం పెరిగిపోతుంది.


అందుకే ప్రశాంతంగా బ్రతకవలసిన వాడు అశాంతిగా కాలాన్ని, రోగాలతో వెళ్లతీస్తున్నాడు. ఇకపోతే ఈ డబ్బు ఓ వ్యక్తి ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. అది ఓ పది రూపాయలు కోసం. ఓ వ్యక్తి మద్యం బాటిల్‌తో మరో వ్యక్తిపై దాడిచేసి గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎందుకు ఇంత కక్ష అంటే మద్యం తాగడం కోసం పది రూపాయలు అప్పు ఇవ్వలేదని కోపంతో. ఇక శ్రీశైలం మండలం సున్నిపెంట ఎస్‌ఐ పీరయ్యయాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 


సున్నిపెంట గ్రామానికి చెందిన షేక్‌ మౌలాలి సున్నిపెంట ప్రభుత్వ మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న శ్రీశైలానికి చెందిన దాసరి శివ అనే వ్యక్తి మౌలాలిని రూ.10 అప్పు అడిగాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రికుడైన శివ అక్కడే ఉన్న మద్యం బాటిల్‌ను పగులగొట్టి మౌలాలి గొంతుపై పొడవడంతో రక్తస్రావం అయింది. అక్కడున్న వారు వెంటనే 108 కు ఫోన్ చేయగా వచ్చిన ఆ సిబ్బంది క్షతగాత్రున్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శివపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: