చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో తన కంటే వయసులో చిన్న వాడైనా జగన్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఓటమి తరువాత అయినా బాబు గారి తన తప్పులను తెలుసుకున్నారంటే అది లేదు. జగన్ మాత్రం తన వ్యహాలతో బాబును ఒక ఆట ఆడుకున్నారు. సాధారణంగా ఓటమి ఎదురైన తర్వాత.. కనీసం ఏడాది.. తక్కువలో తక్కువ రెండేళ్ల పాటు వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించటం ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా చేస్తారు. అందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వెల్లడైన నెలకే విమర్శలకు దిగితే ప్రజల్లో ఛీత్కారం పెరుగుతుందన్న విషయాన్ని బాబు మర్చిపోయారు. అంతేకాదు.. ఓటమి ప్రజల్లో సానుభూతిని పెంచాల్సిన దానికి భిన్నంగా తన మీద.. తన పాలన మీదా ప్రజల్లో కసి నెలకొన్న వైనాన్ని ఆయన మర్చిపోయారు.


దీనితో చంద్రబాబు ఓటమి నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని అర్ధం అవుతుంది. దీని వల్ల జరిగిన నష్టమేమంటే.. ప్రజలకు తానేదో చేయాలన్న తపనను బాబు ప్రదర్శిస్తే.. ఆయన తీరు అతిగా ఏపీ ప్రజలు ఫీలయ్యే పరిస్థితి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్నోఇన్నో సీట్లు గెలుచుకోవాలన్న ఉద్దేశంతో.. కేడర్ ను చైతన్యపరిచేందుకు బాబు కిందామీదా పడుతున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణం తనకు అనుకూలంగా లేదన్నవిషయాన్ని బాబు మర్చిపోతున్నారు.ఇదే.. బాబు చేత వరుస తప్పుల్ని చేయిస్తోంది. అయితే.. తాను తీసుకునే నిర్ణయాలకు చెక్ పెట్టే విషయంలో జగన్ తనకంటే ముందుంటారన్న విషయాన్ని బాబు మిస్ అవుతున్నారని చెప్పాలి.


ప్రస్తుతం ఆ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. సరిగ్గా చంద్రబాబు దీక్ష రోజునే బాబుగారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు.  ప్రభుత్వం ఏర్పాటైన నాలుగు నెలల వ్యవధికే ఇసుక కొరతపై పెద్ద ఎత్తున దీక్షను నిర్వహించటం ద్వారా.. ఏపీ ప్రజల్లో తనపై మైలేజీ పెరిగేలా చేస్తుందని బాబు భావించారు.కానీ.. ఆయన ఊహించని విధంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురువారం బెజవాడలో ఆయన దీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయటం.. మరో నేత దేవినేని అవినాష్ పార్టీకి గుడ్ బై చెప్పేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇలా వరుస పెట్టి షాకులు తగిలేలా చేయటంలో జగన్ అండ్ కో సక్సెస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: