ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముఖ్య రాజకీయ నాయకుడికి, ఒక ప్రముఖ కంపెనీ నుంచి ₹150 కోట్లు లంచంగా ముట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ బహిరంగంగా ప్రకటించింది. అయితే ప్రతీ విషయాన్ని పదింతలు చేసి రచ్చ చేసే తెలుగుదేశం పార్టీతో పాటు, ఈ నేపధ్యంలో ఒక సామాజిక వర్గ మీడియా సైతం నిశ్శబ్ధమవటం తేలుకుట్టిన దొంగలాగా సడి చేయక పోవటంలోని ఆంతర్యం, అంతరార్ధం ఏమిటనే సందేహం ఉభయ రాష్ట్రాల ప్రజల మనసులను కెలికేస్తుంది. ఆ డబ్బు ఎవరికి అందింది? ఈ విషయం తెలుగు మీడియాకు తెలియదా? అనే చర్చ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. 

సీఆర్డీఏ - అమరావతికి సంభందించి ₹ 2652 కోట్ల కాంట్రాక్ట్ పనులకు ఒక కంపెనీ నాటి ముఖ్యనేతకు అందచేసిన సొమ్ము ఆధారాలు ఐటీ అధికారుల చేతికి చిక్కడం,  అన్నిటికీ అరచి గీపెట్టే తెలుగుదేశం నాయకులతో సహా ఈ వ్యవహారంలో ఎవరూ నోరు మెదపక పోవడాన్ని గమనిస్తున్న ప్రజలు "అధినేత" అడ్డంగా దొరికిపోయిన విషయం అందరికీ అర్థమైపోయిందని అందుకే కుక్కిన పేనులా, తేలుకుట్టిన దొంగల్లా బిక్కు బిక్కు మంటున్నారని అనుకుంటున్నారు. 

అయితే బీజెపి నాయకత్వం పట్టుబిగించి ఆ గొప్ప అధినేత అక్రమార్జనను తమ రాజకీయ అవసరాల కోసం వినియోగించుకునే సూచనలైతే సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలేమీ జరగనట్లు  తెలుగుదేశం పార్టీగాని, దాని నాయకులుగాని, పచ్చ మీడియాగాని ఎవరూ ఈ విషయంలో నోరు తెరవక పోవటతో ఆ డబ్బెవరికి  ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకున్నారనటంతో ఎలాంటి సంశయం లేదంటున్నారు విశ్లేషకులు.

ముంబై కేంద్రంగా పనిచేసే ఆ కంపెనీ అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ లో నాడు పనులు చేపట్టినప్పుడు తన వంతు కానుక లోని వాటాగా అందించిన మొత్తాల్లో కొంత మొత్తంగా ఆ ముఖ్యనాయకుని చేతికి చేరినట్లు ఇటీవల ఐటీ నిర్వహించిన సోదాల్లో వెలుగు చూసింది.  ఆ విషయాన్ని ఈ నెల 11వ తేదిన ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయం ద్వారా ఐటీ శాఖ  అధికారికంగా విడుదల చేసిన ప్రకటనల్లో స్పష్టంగా పేర్కొంది. ఆ తర్వాతి రోజు ఐటీ సంస్థ తన వెబ్-సైటులో కూడా ఆ ప్రకటనను విడుదల చేసింది.

దక్షిణాదిన, ఢిల్లీ - ముంబై ప్రాంతాల్లో నిర్వహించిన  సోదాల్లో మొత్తం ₹ 3300 కోట్లు పనులకు సంబంధించి జరిగిన అక్రమాలు అంటూ ప్రకటించింది. అందులో ఆంధ్ర ప్రదేశ్ సంబంధించి ముఖ్యనేతకు ₹150 కోట్లు అందినట్లు స్పష్టమైన సమాచారం తమవద్ద ఉన్నట్లు పేర్కొంది. ముంబైకి చెందిన ఆ కంపెనీ దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో ప్రత్యేకత కలిగి ఉంది. నాణ్యత ప్రమాణాలు పాటిస్తుందనే మంచి పేరు కూడా దానికి ఉంది. అందువల్లే కాంట్రాక్టులకు అది 'కోట్ చేసే ధర కూడా ఎక్కువ' గా ఉంటుంది.

తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ లలో కూడా ఈ సంస్థ ప్రభుత్వ, ప్రభుత్వ ప్రమేయమున్నప్రైవేటు పనులు కూడా చేపట్టింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వస్తే అప్పటి ప్రభుత్వం 'కాపిటల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ' అమరావతి పేరుతో రాజధాని నిర్మాణం కోసం పలు ప్రాజెక్ట్ ల కాంట్రాక్టులు పొంది పనులు చేపట్టింది. అందులో చాలా వరకు ప్రాథమిక దశలోనే ఉండిపోయాయి. 

2019లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ఈ కంట్రాక్ట్ లను రద్దు చేసింది. అప్పట్లో ప్రధానంగా రాజధాని నిర్మాణానికి సంబంధించిన తాత్కాలిక భవనాలను చేపట్టిన కంపెనీల్లో ఈ కంపెనీ కూడా ఉంది. అదే విధంగా భవిష్యత్తు కోసం రాజధాని ప్రాంతంలో వివిధ వర్గాల వారికి గృహ నిర్మాణాలు చేపట్టేందుకు నాటి ప్రభుత్వం మూడు కంపెనీలకు పనులు అప్పగించింది. అందులో ఈ కంపెనీకి అత్యధిక భాగం పనులు దక్కాయి. ఈ కంపెనీ నుంచే నేరుగా సదురు గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్న నేతకు ₹150 కోట్లు చేరినట్లు ఐటీ సంస్థ తన దర్యాప్తులో నిర్ధారించుకుంది.

తాత్కాలిక సచివాలయాల నిర్మాణం పూర్తైంది గాని అందులో నాణ్యత కొరవడింది. ఆ పనిలో కొంత భాగం చేయడంతో పాటు వివిధ వర్గాల వారి కోసం  చేపట్టిన గృహాల సముదాయ నిర్మాణ పనుల్లో అధిక భాగం ఈ సంస్థకే దక్కింది. రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణం వివిధ సైజుల్లో చేపట్టాలని గరిష్టంగా 3500 చదరపు అడుగులు మధ్యస్థంగా 1800 చ.అ. కనిష్టంగా 1200 చ. అ. తో పాటు తక్కువగా 900 చ అ. వైశాల్యంతో ఫ్లాట్లు నిర్మించాలనేది లక్ష్యం. ఇవి పూర్తిగా శాసనసభ్యులు మంత్రులు ఉన్నతాధికారు లైన ఐఏఎస్-ఐపీఎస్ లతో పాటు గెజిటెడ్ అధికారులు క్రింద యంత్రాంగానికి వినియోగించే విధంగా వీటిని చేపట్టాలనే విధంగా ₹ 2652 కోట్ల ప్రాజెక్ట్ ఆ మూడు కంపెనీ లకు నాటి ప్రభుత్వం మంజూరు చేసింది. 

ఈ కాంట్రాక్ట్స్ లభించేలా ఏర్పాటు చేసినందుకు ఆయా సంస్థల నుంచి కనీసం 20 శాతం చొప్పున మూడుపులు  ముట్ట చెప్పే విధంగా ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా జరిగిన చెల్లింపుల్లో దాదాపు ₹700 కోట్ల చెల్లింపుల్లో ₹150 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఐటీ సోదాల్లో స్పష్టంగా దొరికిపోయింది.

ఆ 'పెద్దతల' కు ₹150 కోట్ల మొత్తం చేరినట్లు ఐటీ అధికారులు గుర్తించి, నిర్ధారించిన తరవాతే వారు ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తుంది. అయితే కేంద్రంలోని బీజెపి ప్రభుత్వం తమ రాజకీయ అవసరాలకోసం దర్యాప్తు సంస్థలైన సీబిఐ, ఈడి, ఐటీ మొదలైన వాటిని వినియోగించుకుంటోందనే విమర్శ బలంగా ఉంది. అందుకు తగిన విధంగానే ఇటీవల కాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఐటీ అధికారులు విడుదల చేస్తున్న ప్రకటనలు కూడా అందుకు తగిన విధంగా ఉంటున్నాయి. వారి ప్రకటనల్లో రాజకీయ కోణం కనిపిస్తోంది. 

ముఖ్యంగా సదురు పెద్దనేత లాంటి వారు బరితెగించి పనుల్లో ముక్కు పిండి లంచాలు వసూలు చేస్తున్నందన వాటి ఆధారాలు దొరికినప్పుడు విడుదల చేస్తున్న ప్రకటనల్లో ఆ అంశాలు ప్రస్తావిస్తున్నందున రాజకీయంగా కనిపిస్తున్నాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు.ముఖ్యంగా నిర్మాణరంగంలో ఆరితేరిన సంస్థలతో ఈ మహా నేతకు ఎప్పుడూ అవినావిభావ సంబంధమే ఉంటుంది. మొత్తానికి బీజెపి అధినాయకత్వం చేతులకు ఇప్పుడు ఆ మహానేత జుట్టేకాదు అసలైన ఆయువుపట్టు చిక్కింది. 

దాని కారణంగానే ఆ అధినేత బీజెపితో రహస్య ఒప్పందానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఎన్నికలకు ముందు బిజేపితో విబేధించడం రాజకీయంగా చేసిన పెద్ద తప్పేనని ఆయన పలు వేదికలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒప్పేసుకున్నారు. ఇది కేవలం కేంద్ర దర్యాప్తుసంస్థల నుంచి తనకు తనపార్టీ వారికి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకే ఆయన ఆ విధంగా పాదాక్రాంతమయ్యారని అంటున్నారు. ఈ పరిస్థితిని ముందే ఊహించి తమ పార్టీకి సంబంధించిన కొందరు రాజ్యసభ ఎంపీలను బీజెపిలోకి పంపించేశారు. బీజెపిలో చేరిన ఆ నేతలు తమ మహానేత అజెండాను బీజెపి ద్వారా అమలు చేయించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తమ తల తీసి బీజెపి కాళ్ళదగ్గర పెట్టినప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ చర్యల వేగాన్ని తగ్గించకపోగా "డబుల్-ఎడ్జుడ్ బ్లేడ్" పదునును మరింతగా పెంచారు. 

అయితే అడ్డంగా దొరికిన ఆ మహామేతను సారీ....మహానేతను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే అవకాశం లేదని బీజేపీ నిశ్చయమట. అందుకే దేశ వ్యాప్తంగానూ మరీ ముఖ్యంగా సౌత్ లో వివిధ సంస్థలపై ఐటీ, ఈడీ తమ దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగం గానే గత ఏప్రిల్ నెలలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన దాడుల్లో బయటపడిన ఆధారాల ఆధారంగా, ఈ నెలలో మళ్ళీ ఐటీ దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో సదురు మహానేత మహా అవినీతి సాగరంలోకి ప్రవహించిన లంచాల నదీ ప్రవాహానికి చెందిన ఆధారాలు మరింత స్పష్టంగా ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయాయని తెలుస్తుంది. బహుశ ఇదే కారణంగా  "ఏపి శాసనసభలో మరో బలమైన ప్రతిపక్షం అవతరిస్తుంది" అని బిజేపి పదే పదే చెపుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: