ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి రాజకీయంగా రోజురోజుకూ ఇబ్బందుల్లో పడుతోంది. ఆయన విజయవాడలో దీక్ష చేస్తే సొంత ఎమ్మెల్యేలు కూడా రాలేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయన దీక్షను తన సొంత ఎమ్మెల్యేలు మద్దతు తెలుపలేదని వైసీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు ఆరోపించారు. 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. అంటే చంద్రబాబు దీక్షకు మద్దతు లేదన్నారు.


చంద్రబాబుతో ఉంటే డ్యామేజ్‌ అవుతామనే భయంతోనే టీడీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారన్నారు. గత ఐదేళ్లు చంద్రబాబు ఉచిత ఇసుకను తన కుమారుడు లోకేష్‌, టీడీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చారని దాడి వీరభద్రరావు తెలిపారు. తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సు కోసం ఆయన నామమాత్రంగా పొద్దున నుంచి సాయంత్రం వరకు దీక్ష చేశారని దాడి వీరభద్రరావు మండిపడ్డారు.


చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా డబ్బులిచ్చి ప్రజలను ప్రత్యేక బస్సుల్లో మీటింగ్‌కు తరలించడం చంద్రబాబుకు అలవాటే అని దాడి వీరభద్రరావు అన్నారు. నిన్న భవన నిర్మాణ కార్మికులపై ఉన్న ప్రేమతో దీక్ష చేయలేదన్నారు. లోకేష్‌పై తప్ప ఎవరిపైనా కూడా చంద్రబాబుకు ప్రేమ ఉండదని, అందరితోనూ ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటారని దాడి వీరభద్ర రావు అన్నారు. ఎమ్మెల్యేలను, నాయకులను ఆకర్షించేందుకు దీక్ష చేశారన్నారు. అలాగే బీజేపీని ఆకర్షించేందుకు దీక్ష చేశారన్నారు.


పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబుపై ఉన్న ప్రేమతో ఎందుకు దీక్ష శిబిరాన్ని సందర్శించలేదని దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. గతిలేకనే చంద్రబాబుతో పవన్‌ కొనసాగుతున్నారన్నారు. నిజంగా ప్రేమ ఉంటే నిన్నటి దీక్షలో పాల్గొనే వారన్నారు. ఉచిత ఇసుక వచ్చే వరకు చంద్రబాబు పోరాటం చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తన పాలనలో ఉచిత ఇసుక ప్రజలకు ఇవ్వలేదని, తన కుమారుడు లోకేష్‌కు, తన టీడీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చి రాష్ట్ర ఖజానాను దోచిపెట్టారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: