130 కోట్ల మంది భారతీయులు స్వప్నం నెరవేరబోతోంది. గగన వీధుల్లోకి దూసుకుపోయేందుకు భారతీయ వ్యోమగాములు సిద్ధం అవుతున్నారు.  డిసెంబర్, 2021లో ఇండియాకు చెందిన వ్యోమగాములు గగన్ యాన్ ద్వారా అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్నారు.  గగన్ యాన్ మానవ సహిత మిషన్ ను ఇండియా రెడీ చేస్తున్నది.  2018లో గగన్ యాన్ గురించి మోడీ ఎర్రకోటపై చెప్పారు.  


అప్పటి నుంచి గగన్ యాన్ మిషన్ ఊపందుకుంది. ఈ మిషన్ కు సంబంధించిన క్యాప్సూల్, రాకెట్ తయారీ చాల వరకు కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది.  ఇప్పుడు గగన్ యాన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.  ఇందులో భాగంగానే ఐఏఎఫ్ 12 మందిని ఎంపిక చేసింది. 12 మందిలో మొదట 7 మందిని రష్యా పంపింది.  


అక్కడ మొదట ఏడుగురికి శిక్షణ ఇవ్వబోతున్నారు.  ఆ వారి తరువాత మిగతా ముగ్గురు రష్యా వెళ్లారు. శిక్షణ పొందిన తరువాత 12 మందిలో 4 ను ఎంపిక చేస్తారట.  ఫైనల్ గా ఇద్దర్ని వ్యోమగాములుగా అంతరిక్షంలోకి పంపుతారట.  ఈ మిషన్ 2021, డిసెంబర్ నాటికి అంతరిక్షంలోకి వెళ్తుంది.  ఈ మిషన్ సక్సెస్ సక్సెస్ అవుతుందని, తప్పకుండా ఇండియా అంతరిక్ష మార్కెట్ లో ఆధిపత్యం సంపాదిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, చంద్రయాన్ 3 ని ఇండియా త్వరలోనే ప్రయోగించబోతున్నది. చంద్రయాన్ 2 ప్రయోగం విఫలం అయినప్పయిటీకి.. 95% విజయవంతం కావడంతో.. చంద్రయాన్ 3 ద్వారా మిగిలిన ప్రయోగాన్ని విజయవంతం చేయాలనీ చూస్తోంది ఇండియా.  చంద్రయాన్ 3 తో పాటుగా మరికొన్ని ప్రయోగాలు కూడా రెడీ చేస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికే అంతరిక్ష మార్కెట్ రంగంలో ఇండియా దూసుకుపోతున్నది.  చిన్న చిన్న ఉపగ్రహాలను ప్రయోగించి ఆర్ధికంగా ఇస్రో లాభాలు పొందుతున్నది.  మరికొన్ని సంవత్సరాల్లో ఇండియా చేపట్టబోయే ప్రయోగాలకు కావాల్సిన డబ్బును ఇలా  ఉపగ్రహాలను ప్రయోగించి సంపాదించబోతున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: