సామాన్యుడికి ఆపదలో ఆదుకునే అమృతహస్తం లాంటివి ఆరోగ్యశ్రీ సేవలు. ఇప్పటికే ఈ సేవలను ఏపీ ప్రభుత్వం ఒక్క ఏపీలోనే కాకుండా ఇతర ముఖ్యమైన నగరాల్లో కూడా చెల్లు బాటు అయ్యేలా తీర్మానం చేసి అమలు కూడా చేస్తుంది. దీని వల్ల పెద్ద పెద్ద జబ్బులున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో లబ్ధి చేకూరనుంది. ఇకపోతే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 


ఈ పథకం రూ.5లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుంది. అంతే కాకుండా అన్ని రకాల బియ్యం కార్డు కలిగిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని తెలుపగా దీని సంబంధించి కొన్ని నిబంధనులను విధించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఇకపోతే ఆరోగ్యశ్రీ హెల్త్‌కార్డులకు అర్హుల ఎంపిక నియమావళిని ప్రభుత్వం ఖరారు చేసింది.


ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బియ్యం కార్డుదారులందరికీ వైఎస్ఆర్‌ ఆరోగ్యశ్రీ సేవలు వర్తిస్తాయని, వీటితో పాటుగా బియ్యంకార్డు దారులతోపాటుగా వైఎస్ఆర్‌ పెన్షన్‌ కార్డు, జగనన్న విద్యా, వసతి దీవెనకార్డుదారులు కూడా ఉన్నవారు ఆరోగ్యశ్రీ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇదేకాకుండా వీరితో పాటు 12 ఎకరాల్లోపు మాగాణి ఉన్న వారికి, 35 ఎకరాల్లోపు మెట్ట భూమి యజమానులకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు పొందేందుకు అర్హత కల్పించగా, 35 ఎకరాలకు మించకుండా మాగాణిగానీ, మెట్ట భూమి ఉన్న కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది.


ఇకపోతే మునిసిపాలిటీల్లో 3వేల చదరపు అడుగుల కంటే తక్కువ స్థలానికి పన్ను కట్టే కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కాకుండా రూ.5లక్షల్లోపు ఆదాయం ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైమ్‌, శానిటరీ వర్కర్లు, గౌరవ వేతనం పొందే ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. కుటుంబం మొత్తంలో ఒక కారు ఉన్న ఫ్యామిలీ కూడా ఆరోగ్యశ్రీ సేవలు పొందేందుకు ప్రభుత్వం అర్హత కల్పించింది. ఇది ఒకరకంగా కొందరికి చేదు వార్త కానీ మరికొందరికి శుభవార్తనే. ఎందుకంటే మీ ఆదాయం ఐదులక్షలలోపు ఉన్న ఈ పధకం వర్తిస్తుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: