1948లో కాశ్మీర్లోని కొంతభాగాన్ని  పాక్ ఆక్రమించుకున్న తరువాత, కాశ్మీర్ రక్షణ కోసం అప్పటి ప్రభుత్వం ఆర్టికల్ 370ని ఏర్పాటు చేసింది.  ఈ అధికరణ ప్రకారం కాశ్మీర్ కు కొన్ని అధికారాలను కట్టబెట్టారు.  అయితే, ఈ అధికారాలను అడ్డం పెట్టుకొని కాశ్మీర్లో అల్లర్లు సృష్టించారు.  కాశ్మీర్ లోని హిందువులను, కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోశారు.  కానీ, అప్పట్లో దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.  ఎందుకంటే, వాళ్లంతా హిందువులు కాబట్టి. 


హిందువుల అధికంగా ఉండే దేశంలో హిందువులపై దాడులు జరిగితే పెద్దగా ప్రభుత్వం పట్టించుకోలేదు.  అదే ముస్లింలపై ఏదైనా చిన్న దాడి జరిగినా.. దానిపై సమాజం పెద్దగా రియాక్ట్ అవుతుంది.  ఏదో జరిగిపోతున్నట్టు బాధపడిపోతారు.  బాధపడటమే కాదు.. హిందువులను నానా మాటలు అంటారు. కాశ్మీర్లో 1990వ దశకంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారట. 


ఓ హిందూ యువతికి కొందరు ముష్కరులు అతి కిరాతకంగా అత్యాచారం చేసారట.  ఆవాత చెక్కలను కోసే రంపం మీదకు ఆ యువతిని నెట్టడంతో ఆమె రెండు ముక్కలుగా మారిందని.. అది వర్ణనాతీతంగా బాధ అని అక్కడి వ్యక్తులు చెప్తున్నారు.  ఓ మిల్లులో పనిచేసే ఓ హిందువును ముష్కరులు దారుణంగా కాల్చి చంపడమే కాకుండా, అతని రక్తమాంసాలను అతని భార్య చేత తినిపించారని పేర్కొన్నారు.  


అప్పట్లో మానవహక్కులు రాష్ట్రంలో ఉల్లంఘించబడినట్టుగా అక్కడి ప్రజలు చెప్తున్నారు.  అధికరణను రద్దు చేయడం అంటే.. కాశ్మీర్లో మానవహక్కులను తిరిగి పునరుద్ధరించడమే అని కాశ్మీరీ పండిట్లు పేర్కొంటున్నారు.  కాశ్మీర్లో అల్లర్లకు ఇకపైనైనా చెక్ పడుతుందని ఆశిస్తున్నట్టు కాశ్మిర్ హిందువులు పేర్కొంటున్నారు.  కాశ్మీర్ లో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని, అందరికి అన్ని రకాల సౌకర్యాలు అందాలని కోరుకుంటున్నట్టు కాశ్మీర్ ప్రజలు తెలియజేస్తున్నారు.  ప్రస్తుతం కాశ్మీరం ప్రశాంతంగా ఉన్నది.  ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నారు. ఇలానే అందరు హ్యాపీగా ఉండాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: