ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో పోర్న్ చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో లైంగిక దాడులు పెరగటానికి పోర్న్ కారణమని అభిప్రాయం వ్యక్తం చేసే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. రోజురోజుకు లైంగిక దాడులకు సంబంధించిన కేసులు పెరిగిపోతున్నాయి. పోర్న్ ప్రభావంతో కొందరు వావి వరుసలు మరిచి లైంగిక దాడులకు పాల్పడుతూ ఉన్నారు. 
 
సీబీఐ దేశంలో విచ్చలవిడిగా పెరుగుతోన్న పోర్న్ ను అరికట్టేందుకు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న చైల్డ్ పోర్న్ ను నివారించేందుకు సీబీఐ ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. ఇంటర్నెట్ లోని చైల్డ్ పోర్న్ ను నివారించేందుకు ఒక స్పెషల్ టీంను సీబీఐ ఏర్పాటు చేసింది. ఢిల్లీలో చైల్డ్ పోర్న్ ను నివారించేందుకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థను సీబీఐ స్థాపించింది. 
 
సీబీఐ ఆధ్వర్యంలో పని చేసే స్పెషల్ టీం చైల్డ్ పోర్న్ వీడియోలను అప్ లోడ్ చేస్తున్న వారిపై మరియు చైల్డ్ పోర్న్ ను వీక్షించే వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోనుంది. ఐటీ యాక్ట్ (2000), పోక్సో చట్టం కింద చైల్డ్ పోర్న్ వీడియోలు అప్ లోడ్ చేసేవారితో పాటు చైల్డ్ పోర్న్ వీడియోలను వీక్షించే వారిపై కేసులు నమోదు కానున్నాయి. మరోవైపు గూగుల్, ఫేస్ బుక్ మొదలైన సంస్థలు అశ్లీల వెబ్ సైట్లు చూసేవారి డేటాను పసిగడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. 
 
గతంలో జరిగిన ఒక అధ్యయనంలో 93 శాతం అశ్లీల వెబ్ సైట్లు థర్డ్ పార్టీ యాప్స్ కు డేటాను లీక్ చేస్తున్నట్టు తేలింది. కేవలం 17 శాతం అశ్లీల వెబ్ సైట్లు మాత్రమే సెక్యూరిటీని కలిగి ఉన్నాయని తేలింది. ఈ అధ్యయనంలో 79 శాతం వెబ్ సైట్లు థర్డ్ పార్టీ కుకీస్ కలిగి ఉన్నాయని తేలింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: