తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రే ప్రాంతీయ పార్టీకి...ప్ర‌ధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీకి ద‌క్క‌ని గౌర‌వాన్ని సొంతం చేసుకోవాల‌ని  డిసైడ్ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న ఆయ‌న ఇందుకు త‌గిన కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకున్నారు. త‌న‌దైన ముద్ర‌తో ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం సిద్ధ‌మ‌య్యారు. ఈ నిర్ణ‌యం...దేశం మొత్తానికి తానే పాఠాలు చెప్పాన‌ని...విజ‌న‌రీన‌ని ప్ర‌క‌టించుకునే తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు అవ‌మానం...కేసీఆర్‌కు గౌర‌వాన్ని తెచ్చిపెడుతుంద‌ని ప‌లువురు అంటున్నారు. 


తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. టీఆర్‌ఎస్‌పీపీ సమావేశానికి తొలిసారిగా హాజరైన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, పార్టీ అవసరాలకోసం ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. కాగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీఆర్ఎస్‌కు ఢిల్లీలో కార్యాలయం నిర్మించుకోవడానికి వేయి గజాల స్థలం కేటాయించే అవకాశముంది. వ‌చ్చే నెల‌లో లేదా సంక్రాంతి పండగ తర్వాత ఢిల్లీలో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. రెండు మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. 


టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి అనువైన స్థలం కోసం పార్టీ ఎంపీలు ఇప్ప‌టికే కొన్ని ప్రభుత్వ స్థలాలు పరిశీలించాల‌ని గ‌తంలో కేసీఆర్ ఆదేశించారు. ఎంపీలతోపాటు వాస్తు నిపుణులు సైతం పరిశీలనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా స్థలాలను స్వయంగా  పరిశీలించి, అనువైన స్థలం ఎంపిక చేసే అవకాశముంది. అయితే, తెలుగుదేశం పార్టీ రాజ్య‌స‌భ ప‌క్షం ఏకంగా బీజేపీలో విలీన‌మైపోయిన త‌రుణంలో...త‌న‌ను తాను జాతీయ పార్టీగా అభివ‌ర్ణించుకుంటున్న నేప‌థ్యంలో...అదే గ‌డ్డ‌కు చెందిన మ‌రో ప్రాంతీయ పార్టీ....పైగా త‌న జూనియ‌ర్ అని చంద్ర‌బాబు స్వ‌యంగా ప్ర‌క‌టించుకునే కేసీఆర్ సార‌థ్యంలో గులాబీ ద‌ళం ఢిల్లీలో కార్యాల‌యం ఏర్పాటు చేయ‌డం స‌హ‌జంగానే....చంద్ర‌బాబుకు అవ‌మానం వంటిద‌ని విశ్లేష‌కులు అంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: