మొన్నటి చంద్రబాబు ఇసుక దీక్షలో నారా లోకేశ్ జగన్ డౌన్ డౌన్ అంటూ రచ్చ రచ్చ చేశారు. ఏం చేస్తారో చేసుకోండని సవాల్ విసిరారు. అయితే లోకేష్‌ మూడుసార్లు సీఎం డౌన్‌ డౌన్‌ అంటే.. చంద్రబాబు దగ్గర నుంచి ఇద్దరు జారిపోయారని వైసీపీ నేతలు అంటున్నారు. లోకేష్‌ నోరు మంచిది కాదని వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు విశ్లేషించారు. చంద్రబాబు డౌన్‌ డౌన్‌ అను ఆయన పెరుగుతారు... ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో ప్రచారం చేయాలనే ప్రయత్నం సమంజసం కాదు అంటున్నారు అంబటి రాంబాబు.


చంద్రబాబు తానా అంటే పవన్‌ తందానా అంటున్నాడని... చంద్రబాబు ఆదేశాల మేరకు వైయస్‌ఆర్‌ సీపీ, సీఎం వైయస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నాడని అంబటి రాంబాబు అంటున్నారు. రాజకీయ విమర్శలు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. పైకి పాలసీల మీద మాట్లాడుతున్నానని పవన్‌ చెబుతున్నాడు.. వైయస్‌ జగన్‌ జైల్లో ఉన్నారు. విజయసాయిరెడ్డి సూటికేసుల కంపెనీలు అని మాట్లాడడం పాలసీలపై మాట్లాడడం అంటారా..? తాటతీసి మూలన కూర్చోబెడతాను. ఇవన్నీ పాలసీ మాటలు అంటారా.. వ్యక్తిగతం అంటారా..? కనీసం ఇంగింత జ్ఞానం కూడా లేదా పవన్‌ కల్యాణ్‌..? అంటూ మండిపడ్డారు అంబటి రాంబాబు.


చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ కలిసి వైయస్‌ జగన్‌ను ఏం చేయాలనుకుంటున్నారు. అటు ఇటు ఎటైనా మేమంతా వైయస్‌ జగన్‌ వెంటే నడుస్తాం. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక విలువలు పవన్‌కు లేవు. పెళ్లిళ్లు మీరు కూడా చేసుకోండి అని మాట్లాడుతున్నాడంటే సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు. బొత్స సత్యనారాయణ విమర్శిస్తే మూడు నెలల్లో మంత్రి పదవికి కొనసాగింపు ఉంటుందని పవన్‌ మాట్లాడుతున్నాడు. వైయస్‌ జగన్‌పై ఎగేసుకొని విమర్శిస్తున్న పవన్‌కు ఎక్కడి నుంచి ప్యాకేజీ వస్తుందని ఎవరిని అడిగినా చెబుతారు అని మండిపడుతున్నారు అంబటి రాంబాబు..


ముందు జనసేన కార్యకర్తలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. తెనాలిలో ఉన్న బాబు, లింగమనేని బాబు కలిసి చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లి ప్యాకేజీలు మాట్లాడిన సంగతి అందరికీ తెలుసు. చంద్రబాబు ఎవరు చెబితే వారికి టికెట్లు ఇచ్చి మీ పార్టీని మీరే సర్వనాశనం చేసుకున్నారు. చంద్రరాబు, పవన్‌ ఇద్దరూ ఇసుక గురించి, ఇంగ్లిష్‌ గురించి మాట్లాడుతున్నారు.ఇసుకలోంచి రాజకీయ తైలం తీయాలని ప్రయత్నం చేయడం ధర్మం కాదని అంబటి రాంబాబు హితవు పలికారు.


మరింత సమాచారం తెలుసుకోండి: