ప్రధాని నరేంద్ర మోడీ చాతి అందరి పాలకుల కంటే పెద్దది అని చెప్పలేమో. ఆయన అనేక తీవ్రమైన సమస్యలను తన పదవీకాలంలో పరిష్కరించారు. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేశారు. మోడీ ది గ్రేట్ అనిపించుకున్నారు. ఈ దేశానికి మోడీ ఉండబట్టే గర్వంగా తలెత్తుకుంటున్నామని పలుమార్లు  భారతీయులు అనుకునేలా మోడీ సమర్ధతతో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి.


ఇదిలా ఉండగా మోడీ శీతాకాల సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులను చట్టాలుగా చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో అత్యంత ప్రముఖమైనది ఉమ్మడి పౌరసత్వ బిల్లు. నిజానికి ఈ బిల్లు కూడా బీజేపీ అమ్ముల పొదిలోనిదే. జనసంఘ్ కాలం నాటింది. కొన్ని దశాబ్దాలుగా జనసంఘ్, బీజేపీ కూడా ఎన్నికల హామీగా ఇస్తున్న  అంశం ఇది. మరి అటువంటి అంశానికి ఇన్నాళ్ళకు బూజు దులపాలని నరేంద్ర మోడీ సర్కార్ ఆలోచన చేస్తోందట.


దేశంలో అందరికీ ఒక్కటే కోడ్ ఉండాలి. పర్సనల్ లా వేరేగా అవసరం లేదని బీజేపీ ఎన్నాళ్ళుగానే వాదిస్తోంది. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే న్యాయం అన్నది బీజేపీ నినాదం, అందరూ భారతీయ జెండా నీడన తలదాచుకుంటున్నపుడు వేరు కుంపట్లు, వేరు వేరు న్యాయాలు ఎందుకు అన్నది బీజేపీ ఆలొచన. నిజంగా ముస్లిం వర్గానికి ప్రత్యేక లా బోర్డ్ ఒకటి ఉంది. దాంతో న్యాయం కొందరికి దక్కడం లేదు, అన్యాయం అయిపోతోందన్న భావన  ఉంది.


దీని మీద చర్యలు తీసుకోవచ్చు కానీ లౌకిక వాదం ముసుగులో ఇంతకాలం కొన్ని పార్టీలు నెట్టుకు వచ్చాయి. ఇపుడు బీజేపీ కత్తికి ఎదురులేదు కాబట్టి మోడీ సాహసంతో ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలో ఉమ్మడి పౌర బిల్లుని ప్రవేశపెడతారని అంటున్నారు. ఎటూ లోక్ సభలో బీజేపీకి మెజారిటీ ఉంది. రాజ్యసభలో మ్యానేజ్ చేస్తే కామన్ సివిల్ కోడ్ కూడా తొందరలోనే చట్టం అయిపోతుంది.


ఇప్పటికే అయోధ్య సమస్య పరిష్కారంలో మోడీ సర్కార్ తనదైన‌ శైలిని కోర్టు బయట చూపించి సజావుగా తీర్పు వచ్చేలా చూసింది. ఇక 70 ఏళ్ళ కాశ్మీఎర్ సమస్యకు కూడా పరిష్కారం కనుగొంది. . ఇపుడు కామన్ సివిల్ కోడ్ కూడా అమల్లోకి తెస్తే జనసంఘ్ ఆవిర్భావానికి సార్దకత చేకూరుతుంది. అలాగే బంపర్ మెజారిటీతో రెండు సార్లు బీజేపీని దేశంలో ఎన్నుకున్నందుకు కూడా బీజేపీ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: