ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ, అలానే తమ ప్రధానమైన 26 డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు గత 42 రోజులుగా సమ్మె చేస్తున్నారు.  ఈ సమ్మెలో భాగంగానే ఇప్పుడు జేఏసీ నేతలు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.  ప్రస్తుతానికి ప్రభుత్వంలో విలీనం చేయడం అనే కార్యక్రమాన్ని పక్కన పెట్టిన జేఏసీ, ఇప్పుడు కేవలం డిమాండ్లపైనే దృష్టి పెట్టింది.  డిమాండ్లు నెరవేరిస్తే.. సమ్మె విరమిస్తామని అంటోంది. 


కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జేఏసీ సమ్మెను మరింత ఉదృతం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.  నిన్నటి రోజున రిలే నిరాహార దీక్షను చేపట్టిన జేఏసీ, ఈరోజు నుంచి నిరవధిక నిరాహార దీక్షను చేపట్టేందుకు సిద్ధం అయ్యింది.  నలుగురు జేఏసీ నేతలు ఈ దీక్షకు కూర్చోబోతున్నారు. నిరవధిక నిరాహార దీక్ష చేస్తే దానివలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.  


ఇది ఇప్పుడు మంచిదికాదు.  అందుకే ప్రభుత్వం అన్ని అలోచించి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  జేఏసీ నిరవధిక నిర్ణయాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.  అశ్వద్ధామ ఇంటివద్ద హడావుడి వాతారణం నెలకొన్నది.  ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నది తెలియాల్సి ఉన్నది.  


ఇక హైకోర్టు హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన సమయంలోనే కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అయినట్టుగా పేర్కొన్నది.  కానీ, కార్మికులు మాత్రం ఉద్యోగాలు ఎక్కడికి వెళ్లవని భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.  ఇక ఉద్యోగాలు లేకపోవడంతో.. సమ్మె విజయవంతం కాకపోవడంతో దాదాపుగా 30 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు.  ఈ ఆత్మహత్యలను ప్రభుత్వం వక్రీకరిస్తోంది.  కార్మికుల చావుకు కాంగ్రెస్, బీజేపీలే కారణం అని వాదిస్తోంది.  ఇక సోమవారం రోజున ప్రైవేట్ రూట్లపై హైకోర్టు తీర్పు ఇవ్వబోతున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: