తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సీతంపేటలో సంవత్సరం క్రితం ఏస్ ఆసుపత్రి ప్రారంభమైంది. ఈ ఆసుపత్రికి జిల్లా వైద్యాధికారి నుండి ఎటువంటి అనుమతులు లేవు. ఒక షాపులో ఏడు పడకల ఆసుపత్రి అంటూ ఏస్ ఆసుపత్రిని ప్రారంభించిన రాజేష్, రామచంద్రన్ జూనియర్ డాక్టర్లైన ఎం రాజేంద్ర, పి నిఖిల్ తో కలిసి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ ఆసుపత్రిలో డిగ్రీ చదివి మెడికల్ షాపు నిర్వహించిన అనుభవం ఉన్న రాజేష్, రామచంద్రన్ డాక్టర్ల అవతారమెత్తారు. 
 
కొన్ని రోజుల క్రితం ఏస్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవం జరిగింది. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆసుపత్రి యాజమాన్యం ఐదుగురు రోగులను పంపిస్తే 1,000 రూపాయల గిఫ్ట్ కార్డు, పది మంది రోగులను పంపిస్తే 2వేల రూపాయల గిఫ్ట్ కార్డు, 15 మందికి 3 వేల రూపాయలు, 25 మందికి 6 వేల రూపాయల గిఫ్ట్ కార్డులు ఇస్తామని ప్రచారం చేసింది. ఈ ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఈ ప్రకటనల గురించి తూర్పుగోదావరి జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందింది. జిల్లా వైద్యాధికారులు తనిఖీలు చేయటంతో ఆసుపత్రిలో రోగుల చికిత్సకు ఉపయోగించే పరికరాలేవీ లేకపోవటంతో ఆశ్చర్యపోవటం వైద్యాధికారుల వంతయింది. అనుమతులు లేకపోవడం, వైద్యం చేయడానికి ఉపయోగించే కనీస పరికరాలు లేకపోవడంతో షాక్ అవ్వడం జిల్లా వైద్యాధికారుల వంతయింది. 
 
వైద్య మండలి ఛైర్మన్ సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఏస్ ఆసుపత్రికి అనుమతులు లేవని, రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని, కేవలం వ్యాపార దృక్పథంతో సరైన పరికరాలు, మౌలిక సదుపాయాలు లేకుండానే ఈ ఆసుపత్రి నిర్వహణ జరుగుతోందని చెప్పారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి నటించిన సీన్ ను ఈ ఆసుపత్రి రిపీట్ చేసిందని స్థానికంగా ఉండే ప్రజలు అనుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: