అదేంటి హెడ్డింగ్ తప్పుగా పెట్టారా అని షాక్ తినాల్సిన పనిలేదు. ఇది కరెక్ట్ హెడ్డింగే. అవును మరి బాబుకు జగన్ అంటే మంట. ఆయన అంతెత్తున ఎగిరిపడతారుగా. ప్రతి విషయంలో జగన్ని రంకెలేసే బాబుకు జగన్ని మెచ్చుకోవడం కూడా ఉంటుందా అన్న అనుమానాలు అయిదు కోట్ల  ఆంధ్రులకు కలగడం సహజం. ఆ మాటకు వస్తే తెలుగు రాజకీయాలు తెలిసిన ప్రతి భారతీయుడికి కూడా ఇది షాకింగ్ లాంటి న్యూసే.


అవుని మరి ఇది  ఎలా జరిగింది. ఎందుకు  బాబు జగన్ని మెచ్చుకున్నారు. అంటే దాని వెనక కధ ఉంది. తెలంగాణా సర్కార్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అభ్యంతరం చెబుతూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో తాజాగా  అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో పట్టిసీమ నీళ్ళ విషయంలో తెలంగాణా వాటా అడగడం సరికాదు అంటూ గట్టిగానే ఏపీ వాదిస్తోంది. ఇది బాబుకు బాగా నచ్చిందట.


అదే విధంగా గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా బేసిన్‌లోకి తరలించే 80 టీఎంసీలు పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఏపీకి 45, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీలు చెందుతాయని కూడా ఏపీ సర్కార్ తన వాదనను బలంగా వినిపిస్తోంది.  అదే విధంగా  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోందని, సముద్రంలోకి వృధాగా పొతున్న జలాలు వినియోగించుకోవడానికి పట్టిసీమ నిర్మించామని అత్యున్నత న్యాయస్థానానికి ఏపీ సర్కార్ తెలిపిన విధానం బాగుందని బాబు తన పార్టీ వారితో అన్నట్లుగా భోగట్టా.


వాస్తవాలు ఇలా ఉండగా పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టా, శ్రీశైలం, రాయలసీమకు తరలిస్తున్న జలాల్లో 45 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరడం సమంజసంగా లేదని ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమేనని జగన్ సర్కార్ గట్టిగా సుప్రీం కోర్టులో తన వాదనను వినిపించడం పట్ల మాజీ సీఎం గా చంద్రబాబు పూర్తి సంత్రుప్తిని వ్యక్తం చేశారని అంటున్నారు. ఓ విధంగా జగన్ ఇపుడు కరెక్ట్ రూట్లో వెళ్తున్నారని బాబు తన సన్నిహితులతో అన్నట్లుగా భోగట్టా. జగన్ ఇలాగే కేసేయార్ ట్రాప్ లో పడకుండా ముందుకు సాగితే ఏపీకి పూర్తి న్యాయం జరుగుతుందని కూడా అన్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి జగన్ కేసీయార్ వలలో పడి ఏపీకి అన్యాయం చేస్తున్నాడని ఇంతకాలం ఆరోపించిన బాబు ఇపుడు జగన్ వైఖరిని మెచ్చుకోవడం శుభ పరిణామమే.



మరింత సమాచారం తెలుసుకోండి: