మానవ సంబంధాలకే మచ్చ తెచ్చే సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈ దురాగతాలకు అంతు లేకుండా పోతోంది. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా నిత్యం ఎక్కడో ఒక చోట చిన్నారులపై, బాలికలపై, యువతులపై, వివాహితులపై అత్యాచారయత్నాల ఘటనలు, అత్యాచారాలు గురించి వింటున్నాం.. చూస్తున్నాం. దీనికి ముగింపు లేదు సరికదా.. రోజు రోజుకు పెచ్చుమీరిపోవడం సమాజంలో మహిళల భద్రతను వేలెత్తి చూపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం జరిగిన అటువంటి అమానవీయ ఘటనలో ఓ వ్యక్తికి న్యాయస్థానం యావజ్జీవ కఠిన కారాగార శక్ష విధించింది. ఈ ఘటనలో బాధితురాలు, నిందితుడు తండ్రీ కూతుళ్లు కావడం విచారకరం.

 


కొత్తగుడెంకు చెందిన రమేశ్(55) తన కూతురికి పట్టణంలోనే ఓ సంబంధం చూసి పెళ్లి చేశాడు. కానీ కూతురి మీదే కన్నేసిన ఆ తండ్రి కామాన్ని ఆమె కనిపెట్టలేక పోయింది. పెళ్లైన కూతురి ఇంటికి 2016లో చుట్టపు చూపుగా వెళ్లిన తండ్రి కూతురిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు. ఇదే అదనుగా భావించి కూతురు అని కూడా చూడకుండా ఆమైపై అకృత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఖంగుతిన్న ఆమె అప్పట్లోనే త్రీ టౌన్ పోలిస్ స్టేషన్ లో తండ్రిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. మూడేళ్ల విచారణ అనంతరం న్యాయమూర్తి సాక్షులను విచారించారు. నిందితుడిపై నేరం రుజువైనందున న్యాయమూర్తి తీర్పునిచ్చారు. మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానాను విధించారు.

 


ఇటువంటి అమానవీయ సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. దీనిపై ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా ఎవరికీ కనువిప్పు కలగకపోవడం ఆందోళన కలిగించే అంశమే. ఈ ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరముంది. అప్పుడే స్త్రీలకు మరింత భద్రత కలుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: