గత 134 ఏళ్లుగా పెండింగ్ పడుతూ వచ్చిన అయోధ్య వివాదం ఎట్టకేలకు ఈనెల 9 వ తేదీన పరిష్కారం జరిగింది.  ఈ సమస్యకు పరిష్కారం లభించడంతో.. దేశంలోని యావత్ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  మతవిశ్వాసాలకు కోర్టుకు సంబంధం లేదని, కోర్టు కేవలం దానిని భూమికి సంబంధించిన కేసులనే చూస్తోందని చెప్పింది.  అలానే తీర్పు ఇచ్చింది.  2.77 ఎకరాల భూమిని అయోధ్యలోని రామాలయానికి చెందుతుందని తీర్పు ఇచ్చింది.  ఈ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచె ప్రసక్తి లేదని చెప్పిన కోర్టు, బాబ్రీ కోసం మరోచోట ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని తీర్పులో పేర్కొన్నది.  


అయితే, తీర్పు వెలువడే ముందు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి అనేక మార్గదర్శకాలను రూపొందించింది కేంద్రం.  ఈ కేసు విషయంలో ఎవరూ కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చెయ్యొద్దని, ఎవరూ కూడా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దని, అలా చేస్తే, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  


ఈ తీర్పు వెలువడిన తరువాత ఉత్తరప్రదేశ్ లో దాదాపుగా 100మందిని అదుపులోకి తీసుకున్నారు.  అనేక ప్రొఫైల్స్ లో సామజిక మాధ్యమాల నుంచి తొలగించారు.  అలా తొలగించడమే కాదు, వారిపై చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది కూడా.  ఇదిలా ఉంటె, ఇప్పుడు హైదరాబాద్ లో దీనిపై తొలికేసు నమోదైంది.  హైదరాబాద్ లోని సైదాబాద్‌ లోని జీవన్‌ యార్జంగ్ కాలనీకి చెందిన ముస్లీం మహిళ జిల్లే హ్యుమా అయోధ్య గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖలు చేసింది.  తమ సామాజిక వర్గానికి చెందిన వందమందికి పైగా మహిళలు, అమ్మాయిలతో కలిసి యుజలీషా ఈద్గా మైదానంలో సమావేశం ఏర్పాటు చేసింది. 


అలా ఏర్పాటు చేసిన సమావేశంలో,  మొదట 20 నిమిషాలపాటు అందరితో కలిసి ప్రార్ధనలు నిర్వహించింది. ఆ తర్వాత హ్యుమా అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ స్లోగన్లు చేసింది. ఈ స్లోగన్లు చట్టవ్యతిరేకంగా ఉండటంతో.. అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు.   అక్కడికెళ్లిన పోలీసులు హ్యుమాను అదుపులోకి తీసుకున్నారు. హ్యుమాపై 124ఎ, 153ఎ, 153బి, 505-1-బి, 505-1-సి, 505-2, 295ఎ, 34, మరియు 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టులో ఉన్నది.  హైదరాబాద్ లోఅయోధ్యపై మొదటి కేసు నమోదు కావడం, అందులోను ఓ మహిళా ఈ కేసులో ఉండటంతో ఆసక్తిగా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: