తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని నిరుపేదల అందరికీ సొంతింటి కల సాకారం చేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర సహాయం కొరింది. ఈ క్రమంలో ఒక్కో డబుల్ ఇళ్ళు నిర్మాణం కోసం  8 నుంచి 9 లక్షల ఖర్చు పెడుతుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షన్నర రూపాయల సహాయం అందుతుంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో తల పట్టుకుంటున్న కేసీఆర్ కు...  కేంద్రం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం... నిధుల విషయంలో కొర్రీలు  పెడుతోంది. 

 

 

 

 డబుల్ బెడ్ రూమ్ పథకంలో భాగంగా కేంద్రం నుంచి రెండు మూడు దశల కింద మొత్తంగా 18 వందల కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం  ససేమిరా అంటుంది. గత 8 నెలల  నుంచి తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని  నిధులు విడుదల చేయాలని కోరుతున్నప్పటికీ  కూడా కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. లబ్ధిదారుల జాబితా ఇస్తేనే నిధులు విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం మొదటి విడతలో 1200 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం... ఆ తర్వాత రెండు మూడు విడతల్లో మాత్రం నిధుల విడుదలో  అభ్యంతరాలు చెబుతున్నది . దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం భారం మొత్తం తెలంగాణ ప్రభుత్వం పైన పడుతుంది.ప్రతి  ఇంటికి తొమ్మిది లక్షలు ఖర్చు అవుతుండగా..  ఈ భారం  మొత్తం తెలంగాణ ప్రభుత్వం పైన పడుతుంది. 

 

 

 

 జిహెచ్ఎంసి పరిధిలో నిర్మిస్తున్న లక్ష ఇళ్లకు కేంద్రం నుంచి 1500 కోట్లు రావాల్సి ఉంది. అయితే ఈ పదిహేను వందల కోట్లలో  మొదటి విడతలో  600 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఇతర జిల్లాల్లో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి కూడా 9 వందల కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు నిధుల విషయంలో అభ్యంతరం చెబుతూ లబ్ధిదారుల జాబితా అందచేస్తే తప్ప నిధులు  విడుదల చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తేనే నిధుల విడుదల గురించి ఆలోచిస్తాం  అంటూ కేంద్రం చెప్పడంతో గులాబీ బాస్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: