కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారడం జరిగింది. ఆయన తన అత్యంత సన్నిహితుడు కొడాలి నాని తో కలిసి సీఎం జగన్ ని కలవడం, వెంటనే టీడీపీకి రాజీనామా చేయడం ఏపీలో సంచలనంగా మారడం జరిగింది.  జగన్ ని కలవడం, టీడీపీ కి రాజీనామా చేయడంపై తాజాగా విలేఖరుల సమావేశంలో ఆయన మొదటిసారి అధికారికంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు, లోకేష్ తీరును దుయ్యబట్టారు. భజనపరులనే చంద్రబాబు నమ్ముతున్నారని, పార్టీలో మిగిలినవారికి ఎలాంటి ప్రాముఖ్యత లేదంటూ ఆరోపించారు.


ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకుని, అధికారంలోకి వచ్చాక వారిని పక్కన పెట్టేసే సంసారాన్ని ఏమనలంటూ ప్రశ్నించడం జరిగింది. ఎన్టీఆర్ అనంతరం పొత్తు లేకుండా ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేని పరిస్థితికి తెచ్చారని విమర్శించారు. అధికార ప్రభుత్వం మంచి చేస్తుంటే స్వాగతించాలి, చెడు చేస్తుంటే ప్రశ్నించాలి. కానీ మంచి చేసినా వ్యతిరేకించడం ప్రజల్లో వ్యతిరేకతను మూటగడుతుందని, తద్వారా  మాలాంటి నాయకుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.


ఈరోజు నా నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలనే ఆలోచనతో పార్టీని వీడి, జగన్ తో కలిసి నడవడానికి నిర్ణయించుకున్నాను. నా పదవితో సమస్య ఉంటే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, త్వరలో వైసీపీలో చేరుతానని ప్రకటించాడు. నియోజకవర్గ అభివృద్ధికి సహాయం చేస్తానని జగన్ ఖచ్చితమైన హామీ ఇచ్చారని... పార్టీ పరంగా చంద్రబాబు, లోకేష్ కి అభ్యంతరాలు ఉంటే పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు.


మరి వల్లభనేని వంశీ ఆగ్రహం అర్ధవంతమైనదే అంటారా? ఆయన చేసిన ఆరోపణలతో మీరు ఏకీభవిస్తున్నారా? వల్లభనేని వంశీ పార్టీ మారడాన్ని సమర్థిస్తున్నారా? లేదా పార్టీ మారడం కోసం టీడీపీపై వంశీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.


మరింత సమాచారం తెలుసుకోండి: