వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎపిఐసిసి చైర్మన్ రోజా తన నియోజకవర్గంపై దృష్టిపెట్టింది. ఏపీఐసిసి చైర్మన్ గా పదవిని నిర్వహిస్తూ.. రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల కల్పనలో తన వంతు పాత్రను పోషిస్తున్న రోజా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి..నియోజక వర్గం అభివృద్ధిపై దృష్టి సారించింది.   వారంలో నాలుగు రోజులు నియోజక వర్గంలోనే ఉండాలని రోజా నిర్ణయం తీసుకుంది.  


ఇది మంచి నిర్ణయం అనే చెప్పాలి.  ఎందుకంటే, నియోజకవర్గంలో పడుతున్న ఇబ్బందులు రోజాకు తెలుసు.  గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నది కాబట్టి అభివృద్ధి విషయంలో రోజా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయింది.  ఎమ్మెల్యేగా ఆమెను అసెంబ్లీలోకి కూడా అడుగుపెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది.  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆమెను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు.  దీంతో ఆమె ఇబ్బందులు పడింది.  


అయితే, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నియోజక వర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టారు.  పైగా ఆమె నియోజక వర్గంలో మరో వ్యక్తి చేయి పెట్టడానికి వీలులేదని రోజా ఇప్పటికే చెప్పింది.  అటు జగన్ కూడా రోజా నియోజక వర్గంలో మంత్రులు ఎవరూ కూడా జోక్యం చేసుకోవద్దని చెప్పాడు.  అధినేత చెప్పినపుడు ఎవరిపైన ఎందుకు చేతులు పెడతారు చెప్పండి.  సో, ఇప్పుడు రోజాకు అన్ని రకాలుగా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం దొరికింది.  


అయితే, మొదట ఆమె నియోజక వర్గంలో ఉన్న ప్లాస్టిక్ విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.  నగరి నియోజక వర్గాన్ని ప్లాస్టిక్ రహిత నియోజక వర్గంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది.  ఇందులో భాగంగానే రోజా ప్లాస్టిక్ యుద్దాన్ని ప్రకటించింది.  ఎవరైతే కిలో ప్లాస్టిక్ తీసుకొచ్చి ఇస్తారో వారికీ కిలో బియ్యం ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించింది.  ఇది మంచి విషయమే.  దీనికి నగరి ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.  కిలో ప్లాస్టిక్ చెత్తకు కిలో బియ్యం మంచి విషయమే కదా.  సోషల్ మీడియానుంచి కూడా రోజాకు అభినందనలు అందుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: