కట్టుకున్న భార్య కళ్లుగప్పి పనిమనిషితో రొమాన్స్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన దోన్‌గర్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఆర్యన్ అనే వ్యక్తి భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఆర్య‌న్ బాగా డ‌బ్బున్న వ్య‌క్తి కావ‌డంతో ఇంట్లో భార్య ప‌ని చేయ‌లేద‌ని ఓ మ‌హిళ‌ను పెట్టుకున్నాడు. అయితే వారిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన చ‌నువు కాస్తా ఆ త‌ర్వాత వివాహేత‌ర సంబంధం పెట్టుకునే వ‌ర‌కు వెళ్లింది. 


భార్యకు తెలియకుండా పనిమనిషికి చీరలు, వస్తువులు కొనిచ్చి పూర్తిగా తన దారిలోకి తెచ్చుకున్నాడు.రోజూ భార్యను ఏదొక పనిమీద బయటకు పంపి పనిమనిషితో శృంగారంలో పాల్గొనేవాడు. ఈ తంతు కొన్ని రోజులుగా గుట్టు చ‌ప్పుడు కాకుండా న‌డుస్తోంది. ఓ రోజు వీరిద్ద‌రు శృంగారం చేస్తూ ఆర్య‌న్ భార్య కంట‌ప‌డ్డారు. ఆర్యన్ భార్యకు ఈ విషయం తెలిసి తనకు అన్యాయం చేయొద్దని భర్తను వేడుకుంది. 


అయినప్పటికీ అతడి బుద్ధి మారకపోగా మరింత రెచ్చిపోయాడు. భార్య ఎదుటే పనిమనిషితో చనువుగా ఉంటూ వేధించేవాడు. చివ‌ర‌కు ఓ రోజు నిల‌దీయ‌గా కొట్టి చిత్ర‌హింస‌ల‌కు గురి చేశాడు. అయితే భ‌ర్త వ‌దిలేస్తే తన పరిస్థితి ఘోరంగా తయారవుతుందన్న ఆందోళనతో ఆమె ఏమీ అనలేక బాధను భరిస్తూ వస్తోంది. చివ‌ర‌కు భార్య ముందే ఆమె ప‌నిమ‌నిషితో విచ్చ‌ల‌విడిగా రాస‌లీల‌లు కొన‌సాగిస్తున్నాడు. భార్య త‌న జీవితాన్ని నాశ‌నం చేయ‌వ‌ద్ద‌ని ఎన్నోసార్లు ప్రాధేయ ప‌డినా ఆర్య‌న్ మాత్రం ఆమెను మ‌రింత‌గా హింసించేవాడు.


కొద్దిరోజులు అలాగే నెట్టుకొచ్చిన ఆమె భర్త ఆగడాలు ఇక సహించకూడదని నిర్ణయించుకుంది. పనిమనిషితో అతడు సాగిస్తున్న రాసలీలలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సేకరించి బంధువులకు చూపించింది. చివ‌ర‌కు బంధువుల సాయంతో వారు రాస‌లీల‌లు చేస్తుండ‌గా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని ప‌నిమ‌నిషిని, ఆర్య‌న్‌ను పోలీసుల‌కు అప్ప‌గించింది. ఇప్పుడు వారిద్ద‌రు క‌ట‌క‌టాలు లెక్కిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: