ఆంధ్ర ప్రదేశ్ లో మద్యపాన నిషేధానికి సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో మందుబాబులు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్  లో బెల్టుషాపులను నిషేధించడం జరిగింది. అలాగే వైన్స్ షాపులను 8 గంటలకే మూసేయడం, ఏపీతో పోల్చితే తెలంగాణలో ధరలు తక్కువగా ఉండటం. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ సరిహద్దులలో ఉన్న గ్రామాల వారు మందు కోసం మందు బాబులు క్యూ కడుతున్నారు.

నందిగామ, వీరులపాడు, పశ్చిమ కృష్ణాలోని జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలు తెలంగాణను సరిహద్దులో  ఉన్నాయి. మందు బాబులు అంత సూర్యాాపేట, ఖమ్మం జిల్లాలోని వైన్స్ షాపులకు క్యూ కడుతున్నారు. మద్యం ధరలలో కూడా చాలా తేడా ఉంది. పేద, మధ్య తరగతి వారు తాగే సీసాలలో రూ.40 తేడా ఉండడం గమనార్థకం.
 
తెలంగాణలో మాన్షన్‌హౌస్‌ క్వార్టర్‌ రూ.110 ఉండగా, ఆంధ్రాలో రూ.150.  తెలంగాణలో ఫుల్‌బాటిల్‌ రూ.450 ఉండగా, ఏపీలో రూ.610. మార్పియస్‌ క్వార్టర్‌ తెలంగాణలో రూ.220, ఏపీలో రూ.250. ఫుల్‌బాటిల్‌ తెలంగాణలో రూ.820, ఏపీలో రూ.1040.  చీప్‌లిక్కర్‌ తెలంగాణలో రూ.65-80 ఏపీలో రూ.100-120. కొందరు మాత్రంఇదే అదునుగా కొందరు అక్రమ అమ్మకాలకు పాల్పడడం కూడా జరుగుతుంది. తెలంగాణ నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన లిక్కర్ ను స్థానికంగా ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము జమ చేసుకుంటున్నారు అంటే నమ్మండి.


ఇలా తేడాలు ఉండడంతో మందు బాబులు మందు కోసం ఏపీ నుంచి తెలంగాణకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. మరో వైపు ఏపీ ఎక్సైజ్ అధికారులు దీని పై స్పందించారు. తెలంగాణ నుంచి మందు తీసుకొచ్చి నిల్వ చేసే వారి పై కేసులు నమోదు చేస్తాము అని అధికారులు తెలియచేయడం జరిగింది. ఇక తెలంగాణలో మద్యం దుకాణాలలో బాగా అమ్మకాల జోరు పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: