అమ్మతనం అన్నది ప్రతి మహిళా ఆస్వాదించాల్సిన విషయం.  ప్రతి మహిళ కూడా ఏదో ఒకరోజు అమ్మగా మారుతుంది.  అమ్మతనాన్ని ఆస్వాదితుంది.  అమ్మగా మారిన తరువాత ఆమె పొందే ఆనందం అంతాఇంతా కాదు.  అమ్మదనం కోసం ఆమె పడే తపన మాములుగా ఉండదు.  తాను అమ్మ కాబోతున్నానని తెలిసిన క్షణం నుంచి ఆ మహిళ చెందే ఆనందం అంతాఇంతా కాదు.  ఎప్పుడెప్పుడు తనలో నుంచి మరో ప్రాణి బయటకు వస్తుందా అని ఎదురు చూస్తుంటుంది.  


కానీ, ఈ మోడల్ మాత్రం అలాంటి ఆనందం కలుగకుండానే తల్లి అయ్యింది.  తాను గర్భవతి అని మరో పది నిమిషాల్లో బిడ్డ పుట్టబోతున్నంత వరకు తెలియలేదట.  ఎందుకు అలా జరిగిందో తెలియలేదు.  అసలు విషయంలోకి వెళ్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఎరిన్ అనే మోడల్ కు వింత అనుభవం ఎదురైంది.  పొట్ట పెద్దదిగా లేకపోవడం, శరీరంలో పెద్దగా మార్పులు అన్నవి లేకపోవడంతో ఆమె గర్భవతి అనే విషయం తెలియలేదట.  


అయితే, గర్భం రాకుండా ఉండేందుకు పిల్స్ ను వాడినప్పటికీ తనకు గర్భం వచ్చిందని చెప్తోంది.  బిడ్డ పుట్టే వరకు ఈ విషయం తెలియకపోవడంతో ఎరిక్ షాక్ అయ్యింది.  ఇక పుట్టిన బిడ్డ 3.6 కిలోల బరువు ఉన్నట్టుగా చెప్పింది.  బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు మోడల్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.  ఇలాంటి ప్రెగ్నెన్సీని క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అని అంటరాని, 2500 మందిలో ఇలా అరుదుగా ఒకరికి వస్తుందని వైద్యులు చెప్తున్నారు.  


అయితే, ఇలాంటి ప్రెగ్నెన్సీని డివైన్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటరాని అంటున్నారు. సైకలాజికల్ గా తమకు గర్భం రాలేదు అని కొంతమంది ఫీలవుతుంటారని వైద్యులు చెప్తున్నారు.  ఇటీవల కాలంలో క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా గుర్తిస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు.  క్రిప్టిక్​ ప్రెగ్నెన్సీకి గల బయోలాజికల్​ కారణాలను అంచనా వేయడం కష్టమంటున్నారు. ప్లేసెంటా ఉండే పొజిషన్​ వల్ల బిడ్డ కదలికలు తల్లికి తెలుస్తాయని, దాని పొజిషన్​లో తేడాల వల్ల కూడా ప్రెగ్నెంట్​ అన్న విషయం కొందరికి తెలియదని, కదలికలు గుర్తించలేరని వైద్యులు చెప్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: