ఇప్పటికే ఆర్టీసీ సమ్మె వల్ల తల పట్టుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రం నుంచి మరో భారీ షాక్ తగిలింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొరకై రెండు మూడు దశలలో రావాల్సిన నిధులను గత ఎనిమిది నెలల గా కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని అడుగుతున్నది. కానీ కేంద్రం మాత్రం ఆలోచిస్తా అని అనడంతో కెసిఆర్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు.


మొదటి విడతగా రూ.12 వందల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. రెండు మూడు దశల వారీగా ఇవ్వాల్సిన రూ.18 వందల కోట్లని మాత్రం ఇవ్వడానికి కుదరదు అంటుంది. లబ్ధిదారుల జాబితా కావాలని అడగడం... నిధులు ఇవ్వకుండా వాయిదా వేయడం చూస్తుంటే మోడీ సర్కార్ ఇప్పట్లో నిధులు ఇచ్చే దాఖలాలు కనిపించట్లేదు. 


అయితే ఒక్కో డబుల్ బెడ్ రూమ్ నిర్మించడానికి 9 లక్షల దాకా ఖర్చవుతోంది. దాంట్లో ఒకటిన్నర లక్ష కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. జిహెచ్ఎంసి లో నిర్మిస్తున్న ఇళ్లకు రూ.1500 కోట్లు నిధులు రావాల్సి ఉంది. అయితే ఇందులో రూ.600 కోట్లు ఇప్పటికే కేంద్రం ఇచ్చింది. మిగిలిన రూ.900 కోట్ల ఇవ్వడానికి ససేమిరా అంటుంది. అయితే ఇతర జిల్లాలో నిర్మిస్తున్న ఇళ్లకు మరో 900 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఆ నిధులు కూడా ఇవ్వడానికి కేంద్రం ఆసక్తి చూపట్లేదు. ప్రస్తుతానికి లబ్ధిదారుల జాబితా ఇస్తేనే 1800 కోట్ల రూపాయలు ఇస్తానని కేంద్రం చెప్పడంతో కేసీఆర్ కి ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయాడు.


నిరుద్యోగులకు నెలకు నిరుద్యోగ భృతి కింద రూ.3016 ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇంతవరకు ఒక్క రూపాయ కూడా ఇవ్వలేదు. కేంద్రం నుంచి ఒక్క రూపాయ రాని కేసీఆర్ సర్కారు తాము ఇచ్చిన హామీలను ఎలా నెరవేస్తుందో చుడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి: