తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ వెళ్లిపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదని పేర్కొన్న లోకేష్ ను ఉద్దేశించి తన లాంటి వాళ్ళు వెళ్లి పోతే నష్టం లేదని, పప్పు లాంటివాళ్ళు,గుదిబండలుగా మారి పార్టీలో ఉంటే నష్టమని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. పప్పు బరువు మోయలేక టిడిపి పడవ మునిగి పోతుంది అని వంశి తిట్టిపోశారు. షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం పై మాట్లాడిన వంశీ సహనం నశించి నోటికొచ్చింది తిట్టిపోశారు.


వంశీ యు టర్న్ తీసుకున్నారని లోకేశ్ విమర్శించారు. ఒకరిద్దరు నేతలు పార్టీని వీడటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తాము వ్యతిరేకించడం లేదని... కేవలం తెలుగు మీడియం ఆప్షన్‌ను కొనసాగించాలని కోరామని లోకేశ్ అన్నారు. తాను ఇంగ్లీష్‌ మీడియంలోనే చదివానన్న లోకేశ్... సీఎం జగన్ పేపర్ లీకేజీలో దొరికారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి తనపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు.


దీని పై స్పందించిన వల్లభనేని వంశీ,  టీడీపీకి లోకేశ్ ఓ పెద్ద గుదిబండ, స్పీడ్ బ్రేకర్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.ఆస్తులను కాపాడుకొనేందుకే తాను పార్టీ మారినట్టుగా నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. లోకేశ్‌లో ఫైరుందా, ఫైర్ మిషన్ ఉందా అని ఎద్దేవా చేశారు. పార్టీని నడపడానికి చంద్రబాబు కొడుకు అనేది తప్పితే.. లోకేశ్‌లో ఏం క్వాలిటీ ఉందని వంశీ ప్రశ్నించారు. లోకేశ్‌లా అమ్మను, అయ్యను అడ్డం పెట్టుకొని నేను ఎదగలేదంటూ.. ఘాటైన వ్యాఖ్యలు చేశారు.


ఇక జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తే నారా లోకేష్ కు 104 డిగ్రీ ల జ్వరం వస్తుందని ఘాటుగా బదులిచ్చారు వంశీ.  పది జన్మలెత్తినా నారా లోకేశ్.. జూనియర్ ఎన్టీఆర్‌ కాలేడని వంశీ ఎద్దేవా చేశారు. బఫూన్లు, కుక్క బిస్కెట్లు, బఫూన్‌గాళ్లను పక్కన పెట్టుకొని తనపై విమర్శలు చేస్తున్నారని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. లోకేశ్‌కు పాలు, పెరుగు, తోటకూర అమ్ముకోవడానికి హెరిటేజ్ ఉంది.. టీడీపీకే ఇంకేం లేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు లోకేశ్‌కు మధ్య నక్కకు, నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందని వంశీ తెలిపారు


మరింత సమాచారం తెలుసుకోండి: