బుడ్డోడు బుడ్డోడు అంటే..ఏదో చేస్తానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టుగా నెదర్లాండ్ కు చెందిన ఓ బుడ్డోడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.  మాములుగా చిన్నప్పుడు పిల్లలు సరదాగా ఆడుకుంటారు.  9 ఏళ్ల వయసుకు వచ్చే సరికి నాలుగు లేదంటే ఐదో తరగతి చదువుతున్నారు. చిన్నప్పుడు పిల్లలు షార్ప్ గా ఉంటె.. ఆ పిల్లల ఐక్యూ బాగా ఉంటుంది.  ఇక ఐక్యూ 130గా ఉంటె.. వారిని మేధావులు అంటారు.  


అదే ఐక్యూ ఏకంగా 145 ఉంటె వారిని ఏమని అనాలి.  ఎలా వారిని గుర్తించాలి.  ఇప్పుడు ఇదే సమస్య నెదర్లాండ్ మేధావులకు కలిగింది.  నెదర్లాండ్ లోని ఆమ్​స్టర్ డ్యాంకు చెందిన లారెంట్ సైమన్స్ అనే 9 ఏళ్ల కుర్రోడు తెలివి అపారంగా పెరిగిపోయింది.  9ఏళ్లకే  మహా మేధావి అనిపించుకున్నాడు.  ప్రస్తుతం ఈ కుర్రోడు ఈంధోవెన్ యూనివర్సిటీ ఆఫ్​ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.  


ఇరవై పాతిక వయసు వచ్చిన వాళ్ళకే కష్టంగా ఉండే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులో ఈ కుర్రోడు ఆరితేరిపోయాడు.  అవలీలగా చదివేస్తున్నాడు.  పెద్ద పెద్ద వాళ్ళమధ్య ఈ బుల్లి స్టూడెంట్ కూర్చొని పాఠాలు చదువుతున్నాడు.  ఆడుకునే వయసులోనే కష్టసాధ్యమైన ఎలక్ట్రికల్ సర్క్యూట్లను అర్ధం చేసుకొని మెదడుకు పనిచెప్తున్నాడు.  అంతేకాదు, నెక్స్ట్ ఏంటి అని అడిగితె.. చాంతాడంత లిస్ట్ చెప్తున్నాడు.  


కాలిఫోర్నియాలో హయ్యర్ స్టడీస్ చేయాలనీ, అలానే ఆక్స్ ఫర్డ్ వంటి విశ్వవిద్యాలయాల్లో మెడిసిన్ చదవాలని అనుకుంటున్నారట. బాల మేధావిగా పేరు తెచ్చుకున్న లారెంట్ కోసం తల్లి దండ్రులు ఎలాంటి చదువు చెప్పించడానికైనా సిద్ధంగా ఉన్నారు.  చదువుకునే స్కూల్లోనే పేరు తెచ్చుకుంటే చాలు అనుకుంటే.. ఏకంగా ప్రపంచంలోనే అపరమేధావిగా పేరు తెచ్చుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి.   ఇలాంటి మేధావులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.  అపరమేధావిగా పేరు తెచ్చుకున్న ఐన్ స్టీన్ ఐక్యూ ఈ మేధావి కంటే తక్కువే కావడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: