సంక్షేమ ప్రభుత్వం అనేది ప్రజలకు మెలుజేసే క్రమంలో అర్హతలు, అనర్హతలను ముందుగా నిర్ణయిస్తుంది. అర్హతలు ఉన్నవారికే సంభందిత ప్రభుత్వ శాఖలు ప్రయోజనాలు కేటాయిస్తారు. తద్వారా ఎంత మంది ఆ పద్దు క్రింద సంక్షేమ ప్రయోజనం పొందుతున్నరనే జాబితా తప్పనిసరిగా ఉంటుంది. ఉండాలి కూడా.  అయితే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్నతో మరో షాక్ ఇచ్చింది.


ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో తలబొప్పి కట్టించు కుంటున్న గులాబీ అధినేతకు కేంద్రం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం నిధుల అందించే విషయంలో ప్రశ్నల జాబితా పంపించింది. ఈ పథకం కోసం కేంద్రం రాష్ట్రానికి కొన్ని నిధులను దశలవారీగా అందిస్తుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద ఒక దశ నిధులను అందించిన కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ రెండు, మూడు దశల కింద రావాల్సిన ₹ 1800 కోట్లను విడుదల చేసేందుకు నరేంద్ర మోదీ సర్కార్ ససేమిరా! అంటోంది. గత ఎనిమిది నెలలుగా నిధులను అర్ధిస్తుంటే లబ్ధిదారుల జాబితా ఇస్తేనే నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెబుతోంది. 
డబుల్ బెడ్రూం ఇళ్లపై... కేసీఆర్‌ సర్కార్‌కు కేంద్రం షాక్
"డబుల్ బెడ్రూం ఇళ్ల" కు మొదటి విడతలో ₹ 1200 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం రెండు, మూడు విడతల్లో నిధుల విడుదలకు అభ్యంతరాలు చెబుతోంది. ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటికి దాదాపు ₹ 9 లక్షలు ఖర్చవుతుండగా, కేంద్రం తన వంతుగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద  లక్షన్నర రూపాయలు ఇస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న లక్ష ఇళ్లకు కేంద్రం నుంచి ఇంకా ₹1500 కోట్లు రావాల్సి ఉంది. అయితే ఇందులో మొదటి విడత కింద ₹ 600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇంకా ₹ 900 కోట్లతోపాటు ఇతర జిల్లా లో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి మరో ₹ 900 కోట్లు ఇవ్వాల్సి ఉంది.


ఇప్పుడీ నిధుల విడుదల విషయంలో సందేహాలను వ్యక్తం చేస్తూ కొర్రీలు వేస్తూ లబ్ధిదారుల జాబితాను పంపించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. ఆ జాబితా ఇస్తేనే నిధుల విడుదల గురించి ఆలోచిస్తామని తేల్చి చెప్పడంతో తెలంగానా లోని కేసీఅర్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
Image result for double bedroom <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HOUSE' target='_blank' title='house-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>house</a> plan in telangana
ఇందులో కేంద్రాన్ని గాని మరెవరినైనా నిందించటానికి ఏముంది? డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎవరెవరికి కేటాయించారో ఆ జాబితా పంపితే సరి. ఆ జాబితా తెలంగాణా ప్రభుత్వం వద్ద లేదా! మరి డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎవరెవరికి పంచారు? అసలు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణమే జరపకుండానే కేంద్రం వద్ద తీసుకున్న సొమ్ములు ఏం చేశారు? అసలు ఆ పేరుతో రాష్ట్రం చేసిన ఖర్చుకు లెక్కలు ఉండాలి కాదా! డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణానికి మొత్తం ₹ 9000 కోట్లు ఖర్చులో ₹1500 కోట్లు మాత్రమే  కేంద్రం ఇస్తుండగా లెక్కలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వానికి  ఉలుకెందుకు? దీనితో కలిపి ఎవరెవరికి ఇళ్ళు కేటాయించారో ప్రజలకు వివరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే కదా! ప్రభుత్వం ఎవరు నడుపుతున్నారు? వారే ₹1500 కోట్ల లెక్క కేంద్రానికి, ₹7500 కోట్ల లెక్క తెలంగాణా ప్రజలకు వివరించాలి కదా!  వివరించ లేరా? అంటే మొత్తం ₹9000 కోట్లు ఏమైనట్లు?   

మరింత సమాచారం తెలుసుకోండి: