ఫిరాయింపుల‌పై ముందు నుంచి ఒకే మాట‌.. ఒకే బాట మీద ఉంటోన్న జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఇప్పుడు ఆ మాట మీద నుంచి జారుతున్న‌ట్టే కనిపిస్తోంది. పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్ ఇత‌ర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకునేది లేద‌ని చెప్పేశాడు. ఇక గ‌త ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఏకంగా 23 మందిని చేర్చుకోవ‌డంతో జ‌గ‌న్ మ‌రింత ప‌ట్టుద‌ల‌కు పోయి భ‌విష్య‌త్తులో ఎప్పుడూ కూడా ఇత‌ర పార్టీల సింబ‌ల్‌పై గెలిచిన ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకోన‌ని మ‌రింత స‌వాల్‌గా చెప్పారు.


చాలామంది మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఈ విషయంలో జగన్ ను అభినందించారు కూడా. కాని ఆరునెలల్లో రూటు మార్చిన‌ట్టే క‌న‌పుడుతోంది. అయితే ఈ విష‌యంలో జ‌గ‌న్ త‌న మీద‌కు నింద రాకుండా చాలా తెలివిగా ముందుకు వెళుతున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. తాజాగా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ త‌న పార్టీతో పాటు ప‌ద‌వికి కూడా రాజీనామా చేశాడు. వంశీ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని వాట్సాప్ చేశాడు.


ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాలంటే స్పీక‌ర్‌కు స్పీక‌ర్ ఫార్మాట్లోనే రాజీనామా చేయాలి. ఇక త‌న మ‌ద్ద‌తు వైసీపీకే అని చెప్ప‌డంతో పాటు త్వ‌ర‌లోనే ఆ పార్టీలో చేర‌తాన‌ని చెప్పాడు.. కానీ ఎప్పుడో చెప్ప‌లేదు. అటు జ‌గ‌న్ కూడా వంశీకి కావాల్సిన సాయం చేస్తూ వ‌స్తుంటాడు. వంశీ కూడా కొద్ది రోజుల పాటు పార్టీలో చేర‌కుండా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటాడు.


అలా మ‌రో యేడాది గ‌డిచేలోగా టీడీపీ నుంచే మ‌రో ఆరేడుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడిపోతారు. అప్పుడు టీడీపీకి ప్ర‌తిప‌క్ష హోదా పోతుంది. ఇలా జ‌గ‌న్ క‌ర్ర విర‌గ‌కుండా... పాము చావ‌కుండా అటు టీడీపీ వాళ్ల‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించి... ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబుపై బుద‌ర జ‌ల్లించి.. వాళ్ల‌ను బ‌ల‌హీనం చేసి... తాము బ‌ల‌డ‌డ‌మే టార్గెట్గా ముందుకు వెళుతున్నారు. ఇటు ఆయ‌న ఏదైతే ఎంచుకున్నాడో ? ఆ ల‌క్ష్యంపై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చే ఛాన్స్ లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: