చంద్రబాబు నిత్యం జగన్ మీద విమర్శలు గుప్పిస్తుంటారు. ఇద్దరు అధికార .. ప్రతిపక్ష నేతలు కాబట్టి అలానే ఉంటారు. అయితే తాను అధికారంలో ఉన్నప్పుడు కానీ, జగన్ అధికారంలో ఉన్నప్పుడు కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏ రోజు కూడా జగన్ నచ్చకపోయిఉండొచ్చు. కానీ, తొలిసారి చంద్రబాబుకు జగన్ తెగ నచ్చేశారట. అందుకు పెద్ద కారణమే ఉంది.. తన శత్రువు జగన్ కూడా భారీ షాకివ్వడంతో చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బవుతున్నారట. నిజానికి నిన్నమొన్నటి వరకు ఆ శత్రువుతో జగన్ చెట్టపట్టాలేసుకుని తిరగడంతో చంద్రబాబు చాలా అసహనానికి గురయ్యారు.ఇంతకీ చంద్రబాబుకు జగన్ అంతగా నచ్చడానికి కారణమేంటో తెలుసా? మరేంటో కాదు..  కాళేశ్వరం విషయంలో అడ్డం తిరగడమే.


కాళేశ్వరం విషయంలో జగన్ ప్రభుత్వం ఇప్పడూ కోర్ట్ లో అఫిడవిట్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రారంభానికి కేసీఆర్ పిలవడం, జగన్ వెళ్లడంతో కేసీఆర్ చెప్పినట్లంతా ఆడుతారని భావించారు. కానీ, కాళేశ్వరం జాతీయ హోదా విషయంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తంచేసింది. కేవలం అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో పాటు ప్రభుత్వం ప్రస్తావించిన అంశాలు కూడా చంద్రబాబును ఆకట్టుకున్నాయట. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం రైట్ డైరెక్షన్లోనే వెళ్లిందని ఆయన అన్నట్లు సమాచారం.కాళేశ్వరానికి జాతీయ హోదా వద్దంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో అనేక ఇతర అంశాలతో పాటు పట్టిసీమ గురించి మాట్లాడింది.


పట్టిసీమ జలాలకు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదని కోర్టులో ఏపీ ప్రభుత్వం చెబుతుంది. పట్టిసీమ జలాల్లో తెలంగాణ వాటా అడగడం కరెక్టు కాదని ఏపీ ప్రభుత్వం నిర్ద్వందంగా చెప్పడం చంద్రబాబును ఇంప్రెస్ చేసిందట. గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా బేసిన్‌లోకి తరలించే 80 టీఎంసీలు పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఏపీకి 45, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీలు చెందుతాయని వివరించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోందని, సముద్రంలోకి వృధాగా పొతున్న జలాలు వినియోగించుకోవడానికి పట్టిసీమ నిర్మించామని తెలిపింది. అయితే, పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టా, శ్రీశైలం, రాయలసీమకు తరలిస్తున్న జలాల్లో 45 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరడం సమంజసంగా లేదని ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమేనని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: