యూకేలోని న్యూలిన్ హార్బన్ లో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి యూకెలోని కార్న్ వాల్ ప్రాంతంలో తెరచాటు పడవలో పని చేసేవాడు. పడవ ప్రయాణిస్తున్న సమయంలో ఆ వ్యక్తి సరదాగా ఫ్రిజ్ లో దూరి పడుకున్నాడు. పడవలో ఉన్న సిబ్బంది ఆ వ్యక్తి ఫ్రిజ్ లో దూరడం గమనించారు. కానీ సరదా కోసం చేస్తున్నాడు కదా అని సిబ్బంది పెద్దగా ఆ విషయం గురించి పట్టించుకోలేదు. 
 
కానీ ఫ్రిజ్ లో దూరిన ఆ వ్యక్తి ఎంతసేపటికీ బయటకు రాలేదు. కొంత సమయం తరువాత సిబ్బంది ఫ్రిజ్ తెరవాలని ప్రయత్నించారు. కానీ ఆ ఫ్రిజ్ లాక్ అయిపోవడంతో ఎంత ప్రయత్నించినా ఓపెన్ కాలేదు. సరదా కోసం ఫ్రిజ్ లో దూరిన వ్యక్తి ఫ్రిజ్ డోర్ లాక్ అవడంతో ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయాడు. ఫ్రిజ్ లో నుండి ఆ వ్యక్తి అరవడానికి ప్రయత్నించినా ఫ్రిజ్ లో ఉండటం వలన ఆ శబ్దం బయటకు రాలేదని ఫ్రిజ్ లాక్ అయిపోయిందని సిబ్బంది చెబుతున్నారు. 
 
ఫ్రిజ్ లాక్ ఓపెన్ కాకపోవడంతో పోర్టు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫ్రిజ్ ను ఓపెన్ చేసి చూడగా ఆ వ్యక్తి అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి లంచ్ చేసిన తరువాత కాసేపు పడుకుందామనే ఆలోచనతో ఫ్రిజ్ లో దూరాడని సిబ్బంది చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోర్టుకు దగ్గరలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 
 
చాలామంది ఫ్రిజ్ లో దూరితే ఏమీ కాదని అనుకుంటారు. కానీ ఫ్రిజ్ లో దూరితే ప్రాణాలే పోతాయని ఈ ఘటనతో నిరూపించబడింది. కొందరు సరదా కోసం, టిక్ టాక్ వీడియోల కోసం పిల్లలను ఫ్రిజ్ లో ఉంచుతారు. కానీ ఫ్రిజ్ చాలా ప్రమాదకరం అని ఇలాంటి ఘటనల ద్వారా తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: