ఏపీలో రాజ‌కీయం రంజుగా మారింది. టీడీపికి చెందిన ఏపీ తెలుగు యువ‌త అధ్య‌క్షుడు దేవినిని అవినాష్‌, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ ఇద్ద‌రూ ఇప్ప‌టికే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అవినాష్ ఇప్ప‌టికే వైసీపీలో చేరిపోయారు. ఇక వంశీ కూడా తాను జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తున్నాన‌ని.. ఇక త్వ‌ర‌లోనే వైసీపీలో చేర‌తాన‌ని కూడా చెప్పేశారు. 


కీల‌క‌మైన కృష్నా జిల్లా నుంచి కీల‌క నేత‌లుగా ఉన్న అవినాష్‌, వంశీ ఇద్ద‌రు పార్టీ మారిపోవ‌డంతో ఆ పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర‌మైన ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అస‌లు పార్టీలో మిగిలిన కీల‌క నాయ‌కులు అయినా ఉంటారా ?  వెళ్లి పోతారో ?  ఎవ్వ‌రికి తెలియ‌ని ప‌రిస్థితి. అస‌లు పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని కూడా చాలా మంది వీరాభిమానులే వాపోతున్నారు. ఇక ఇప్ప‌టికే టీడీపీపై ప‌లువురు సెటైర్లు పేలుస్తుంటే ఇప్పుడు వైసీపీ మంత్రి కొడాలి నాని సైతం చంద్ర‌బాబుపై తీవ్రంగా విరుచుకు ప‌డ్డారు.


ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఎన్టీఆర్‌ను ప‌క్క‌న పెట్ట‌డానికి కార‌ణం కూడా నాని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయనే భావనతో 2009 ఎన్నికల్లో ఆయన చేత చంద్రబాబు ప్రచారం చేయించారని నాని తెలిపారు. అయితే ఆ త‌ర్వాత ఎన్టీఆర్ రాజ‌కీయంగా ఎదిగితే త‌న కుమారుడు లోకేశ్‌కు ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆ తర్వాత ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారని చెప్పారు.


వాస్త‌వంగా చూస్తే లోకేశ్‌ది క‌నీసం కార్పొరేట‌ర్ స్థాయి కూడా కాద‌న్నారు. కుమారుడు అయినందువల్లే లోకేశ్ ని ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. అయితే బాబు ఆశ‌లు అన్నీ అడియాస‌లు అయ్యాయ‌ని.. టీడీపీకి లోకేశ్ గుదిబండగా మారారని అన్నారు. దివంగత ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, చంద్రబాబులా ఆయన ఏనాడూ సొల్లు కబుర్లు చెప్పలేదని తెలిపారు. నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: