సరదా ఒక్కోసారి ప్రాణం మీదికి వస్తుందని అందరికి తెలిసిన విషయమే. కాని ఎవరు జాగ్రత్తగా ఉండరు. అందువల్ల ఈ అజాగ్రత్త ఒక్కొక్క సారి ప్రమాదంగా మారుతుంది. ఇకపోతే ఈ జీవితం చాలా విలువైనది ఇది గుర్తించని ఈనాటి యువకులు ఎంతగానో అజాగ్రత్తగా ఉంటున్నారు. ఈ అజాగ్రత్త వల్ల  కన్నవారికి కడుపుకోత మిగులుతుంది. ఇన్నాళ్లూ కష్టపడి కాలికి కూడా ముళ్లు గుచ్చుకోకుండా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల బాధను అర్ధం చేసుకోకుండా నేటి పిల్లలు ప్రవర్తిస్తున్నారు.


స్నేహితులతో షికార్లంటూ, సరదాలంటూ ఇష్టం వచ్చినట్లుగా టూర్స్ వేసుకుంటూ  ప్రమాదాల బారిన పడుతున్నారు. అదేమంటే మంచి మాట చెప్పిన వారినే దోషులుగా చూస్తున్నారు. ఇకపోతే కర్ణాటకలోని కలబుర్గిలో  అత్యంత విషాద ఘటన జరిగింది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన జాఫర్ అయూబ్ అనే 22 సంవత్సరాల యువకుడు మరణించాడు. ఈతకొట్టే సమయంలో తలకు బలమైన గాయం తగలడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుందని పోలీసులు తెలిపారు.


ఈతకొడదామని నీటిలోకి దిగిన ఈ యువకుడు తన సరదాలో పడి నీటిలో రాయి ఉందన్న విషయాన్ని గమనించకుండా డై లు కొడుతూ నీటిలో మునకలు వేస్తున్న సమయంలో తలకు అందులో ఉన్న రాయి బలంగా తాకడంతో ఊపిరాడక బయటకు రావడానికి చాలా ప్రయత్నించాడు. అయినా అతని ప్రయత్నం వృదానే అయ్యింది.


అయితే అక్కడి పరిస్దితిని చూసిన వారు జాఫర్ నీటి ఒడ్డునుండి నీటిలోకి ఈతకోసం దూకగా ఆ సమయంలోనే తలకు బలంగా దెబ్బతగిలిందనీ తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్దలం వద్దకు వెళ్లి కేసునమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత్యున్ని హస్పిటల్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును ప్రారంభించామని వారు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: