స్పీకర్ గా తమ్మినేని సీతారామ్ అసెంబ్లీని విజయవంతంగా నడిపిస్తున్న సంగతి విధితమే. తమ్మినేని సీనియారిటే, సహనం, ముఖ్యమంత్రి జగన్ ఆయనకు ఇస్తున్న స్వేచ్చ అన్నీ కలసి ఆయన  సంప్రదాయాలకు అనుగుణంగా సభను నడుపుతున్నారు. గతానికి భిన్నంగా సభ సాగుతోందన్న పేరును కూడా ఆయన అన్ని విధాలుగా తెచ్చుకున్నారు. ఇక తమ్మినేని ఫైర్ బ్రాండ్ గా రాజకీయాలు  గతంలో నడిపారు.


శ్రీకాకుళం జిల్లాలో కూడా ఆయన ఏటికి ఎదురీది పోరాటమే చేస్తూ వచ్చారు. నాడు టీడీపీలో ఉన్నా తరువాత వైసీపీకి వచ్చినా కూడా తమ్మినెని తీరు మారలేదు, ఆయన ముక్కుసూటిగానే వ్యవహరిస్తారని పేరు. అటువంటి తమ్మినేని తాజాగా ఏపీలో ఫిరాయింపులు జోరు అందుకుంటున్నాయని వార్తలు వస్తున్న వేళ తనదైన శైలిలో స్పందించారు. ఫిరాయింపుల చట్టం తన పని తాను చేసుకునిపోతుందని తమ్మినేని తాజాగా చేసిన కామెంట్స్ కాక పుట్టిస్తున్నాయి.


ఏపీలో బీజేపీ పెద్ద ఎత్తున టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కోవాలని చూస్తోంది. అదే సమయంలో వైసీపీ లో చేరాలని వల్లభనేని వంశీ లాంటి వారు చూస్తున్నారు. అటూ ఇటూ గోడ దూకుళ్ళు పెద్ద ఎత్తున సాగుతాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో తమ్మినేని మాత్రం ఎవరు కండువా మార్చినా ఖర్చు అయిపోతారనే అంటున్నారు. వారు సభ్యత్వం కోల్పోతారని, అనర్హత వేటు వేయడం ఖాయమని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. తమ్మినేని హెచ్చరిక చూస్తూంటే బీజేపీలోకి రావాలనుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలకు గుండె దడ తప్పదేమోనని అంటున్నారు.  తమ్మినేని కళ్ళెర్రచేయడంతో ఎవరైనా పార్టీలు మారినా నిబంధనలను విరుద్ధంగా ఉన్నా కూడా వారి పైన వేటు పడడం తధ్యమని న్యాయ నిపుణులు కూడా సూచిస్తున్నారు. అయితే గత సభలో కండువాలు ఫ్రీగా కప్పేసుకుని మంత్రి పదవులు కూడా ఎంజాయ్ చేశారు. కానీ ఇపుడు అలా కుదరదని అంటున్నారు. మొత్తానికి తమ్మినేని విశ్వరూపమే చూపిస్తే ఏపీలో ఉప ఎన్నికలు ఖాయమని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: