దెందలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ గత సెప్టెంబర్‌లో దళితులను దూషించిన కారణంగా ఇతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. ఇలా జరిగిన కొద్ది రోజులకే అజ్ఞ‌ాతంలోకి వెళ్లిపోయారు చింతమనేని. పోలీసులు గాలించినా అప్పుడూ ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత తన భార్య ఆరోగ్యం క్షీణించడంతో అజ్ఞ‌ాతం వీడి భార్యాపిల్లలను చూసేందుకు దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాలలోని తన ఇంటికి వస్తుండగా.. పోలీసులు ప్రభాకర్‌ను సెప్టెంబర్ 11న అరెస్టు చేశారు.


ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే 67 రోజులు జైలులోనే ఉన్న  ప్రభాకర్‌ కు ఇప్పుడు అన్ని కేసుల్లో కోర్టు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇకపోతే 67 రోజుల తర్వాత శనివారం ఏలూరు జైలు నుంచి బయటకొచ్చారు చింతమనేని ప్రభాకర్‌. అతను బయటకు వస్తున్న విషయం తెలిసిన టీడీపీ నేతలు, అభిమానులు జైలు దగ్గరకు భారీగా చేరుకుని, చింతమనేని ప్రభాకర్‌కు ఘన స్వాగతం పలికారు.


ఇక జైలు నుంచి బయల్దేరి చింతమనేని తన ఇంటికి వెళ్లారు. ఇకపోతే ప్రభాకర్ బయటకు వస్తున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇకపోతే కొన్ని రోజుల క్రింతం చింతమనేనిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచడంతో న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది.


వెంటనే ఆయన్ను ఏలూరు జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న చింతమనేనికి బెయిల్ మంజూరులో వింత పరిస్థితి ఎదురైంది. ఒక కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో అరెస్టు చేయడంతో ఆయన జైలుకే పరిమితమయ్యారు. ఎట్టకేలకు 67 రోజుల తరువాత అన్ని కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు విడుదల అయ్యారు...


మరింత సమాచారం తెలుసుకోండి: