వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటూనే రాజకీయాల్లో తనదైన శైలిలో ఎంపీటీసిగా... ఎంపీపీగా... ఎమ్మెల్యేగా... ప్రభుత్వ విప్ గా పదవులను చేపట్టిన దెందలూరు మజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పొలిటికల్ హిస్టరీ గురించి తెలుసుకుందామా మరి...


టీడీపీలో దూకుడు కలిగిన రాజకీయ నాయకుల్లో మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ ముందు వరుసలో ఉంటారు. ఎంత చెడ్డవారని పేరుందో...అంతే మంచి వారని కూడా దెందలూరులో చెబుతారు. తాజాగా పలు కేసుల్లో భాగంగా కొన్ని రోజుల పాటు రిమాండ్ లో ఉండి శనివారం బెయిలు మీద చింతమనేని బయటకు రావడం జరిగింది. 


పశ్చిమగోదావరి జిల్లాలో దెందలూరు నియోజకవర్గలో దుగ్గిరాల గ్రామానికి చెందిన చింతమనేనిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి సర్పంచ్ గా పని చేశారు. యువనాయకుడిగా ఉన్న చింతమనేని తెలుగుదేశం పార్టీ తరపున దుగ్గిరాల ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపు సొంతం చేసుకున్నాడు . ఎంపీటీసి అయిన రెండేళ్ల తర్వాత ఎంపీపీగా చింతమనేని పదవిని చేపట్టడం జరిగింది. 


అలా దెందలూరు నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకుని 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.  చాల ఎక్కువ రోజులు నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేగా చింతమనేని పేరు తన సొంతం చేసుకున్నాడు. 


2014 ఎన్నికల్లో కూడా  చింతమనేని టీడీపీ నుండి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విప్ గా కూడా చింతమనేని బాధ్యతలు నిర్వహించారు. రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన చింతమనేనికి 2019 ఎన్నికల్లో పరాభావం తప్పలేదు అంటే నమ్మండి . వైసీపీ తరపున పోటీ చేసి కఠారు అబ్బయ చౌదరి పైన చింతమనేని ఓడి పాలు అవ్వడం కూడా జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: